NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Pawan kalyan : క్రమంగా కమలానికి దూరం!

pawan kalyan

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఆదివారం బీజేపీ మీద చేసిన వ్యాఖ్యల్లో కటీఫ్ తరహా మాటలు కనిపించాయి. బిజెపి వల్ల ఎలాంటి లాభం లేకపోగా, తెలంగాణ నాయకులతో, ముఖ్యంగా బిజెపి లో ఉన్న నాయకులతో నానా మాటలు పడాల్సి వస్తుంది అన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. దీని వల్ల ఇటు ఆంధ్రాలో, తెలంగాణలో సైతం జనసేన పార్టీ ఎదగలేక పోతుంది అన్న భావన ఆయన మాటల్లో కనిపించింది. ఇది బిజెపి జనసేన మిత్ర త్వానికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో నాన్న చర్చకు తెరలేపింది.

Pawan kalyan
Pawan kalyan

** మిత్ర ధర్మం లో పొత్తు పార్టీ మీద విచిత్రమైన వ్యాఖ్యానాలూ, మిత్ర పార్టీని కించపరిచే మాటలు సరి కాదు. అయితే దీనిని తెలంగాణ బీజేపీ నాయకులు పూర్తిగా పక్కన పెట్టారు. ప్రతిసారీ అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన పార్టీని వారు అవమానపరిచే లాగానే మాట్లాడుతూ వస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన ఈ మాటల జాడ్యాం కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం జనసేన ను పట్టించుకున్నట్లు గా, ఆ పార్టీ తమ పొత్తు అని గుర్తించినట్లుగా కనిపించలేదు.

పలుమార్లు జనసేన తమ మిత్ర పార్టీ కాదంటూ బహిరంగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా జనసేన మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా తెలంగాణ బిజెపి నాయకురాలు డీకే అరుణ సైతం జనసేన ను తీసిపారేసి నట్లుగా మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ కు నేర్చుకున్నట్లు గా అర్థం అవుతోంది. దీంతోనే ఆయన బీజేపీతో కటీఫ్ చేసుకుంటేనే మేలు అన్న భావన ఆయనలో కలగడానికి బిజెపి నేతల మాటల ప్రధాన కారణంగా అర్థమవుతోంది.

** బీజేపీతో పొత్తు వల్ల జనసేన కు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రాలో సైతం ఉక్కు ఉద్యమం, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నిర్ణయం పట్ల బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల జనసేన పార్టీని సైతం, పవన్ వైఖరిని సైతం ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. బీజేపీతో చెలిమి చేస్తూ ఉండటం వల్ల ఇటు ఆంధ్రలోనూ జనసేన పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు అన్న భావనకు పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎదుగుదలకు ఇది ప్రతికూలంగా మారుతుందని భావిస్తున్నారు.

pavan Kalyan & modi

** తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి సీట్ తీసుకోవడం పట్ల జనసైనికులు లో ఆవేదన ఉంది. ప్రతిసారి బిజెపి జనసేన ను వాడుకుంటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు అన్నది జనసైనికుల వాదన. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆరు శాతం పైగా ఓట్లు సాధించిన జనసేన పార్టీ, కేవలం ఒక్క శాతం ఓట్లు కూడా రాని బీజేపీ మీద ఆధారపడటం మీద కార్యకర్తలు నొచ్చుకున్నారు. దీంతో బీజేపీతో కథ చెబితే ఏ ఎన్నికలకైనా ఒంటరిగా వెళ్లేందుకు పవన్ ప్రయత్నించే అవకాశం ఉంటుంది అన్నది పార్టీ అభిప్రాయం.

** జనసేన పార్టీ కు కాపుల మద్దతు క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో బిజెపి సైతం కాపుల ఓట్లు మీద ప్రధాన దృష్టి పెట్టింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల ఓట్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే జనసేన పార్టీ ఒంటరిగా బరిలో ఉంటేనే మేలు అన్నది పవన్ అభిప్రాయం. దీనివల్ల భవిష్యత్తులోనూ పవన్ కళ్యాణ్ వైపు కాపులు వస్తారు అన్నది అంచనా. అలా కాకుండా బిజెపి కాపు నాయకులను ఆకర్షించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే భవిష్యత్తులో మళ్లీ వారిని జనసేన పార్టీ వైపు రప్పించడం కష్టమవుతుంది.

ఈ కారణం కూడా పవన్ మదిలో ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇటు ఆంధ్ర లోనూ అటు తెలంగాణాలోనూ ఏమాత్రం ప్రయోజనం లేని బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే, బయటకు వచ్చి ఒంటరి పోరాటం మేలు అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచించిన తర్వాత నే ఆయన పార్టీ ఆవిర్భావం రోజున బీజేపీ నేతలకు భిన్నంగా పలు వ్యాఖ్యలు చేశారు అన్నది, దాని వెనక నిగూడ అర్థం ఉంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

author avatar
Comrade CHE

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju