NewsOrbit
న్యూస్

Google Chrome: త్వరలోనే గూగుల్ క్రోమ్ పని ఖతం.. విస్తుగొల్పుతున్న టెక్ నిపుణుల విశ్లేషణలు..!

Chrome 100 version: 2008వ సంవత్సరంలో లాంచ్ అయిన గూగుల్ క్రోమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫేవరెట్ బ్రౌజర్ గా మారిపోయింది. వచ్చే ఏడాది గూగుల్ 100 వెర్షన్ రాబోతోంది. అయితే ఈ వెర్షన్ కారణంగా చాలా వెబ్ సైట్లు క్రోమ్ బ్రౌజర్‌లో వర్క్ కాకపోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. 2022, మార్చి నెలలో క్రోమ్ 100 వెర్షన్‌ను గూగుల్ విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ వెర్షన్ అందుబాటులోకి రాగానే యూజర్లు పాత వెబ్‌సైట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారట. ఇందుకు గూగుల్ క్రోమ్ వెర్షన్ డబుల్ డిజిట్ నుంచి త్రిబుల్ డిజిట్ కు మారడమే కారణమని టెక్నాలజీ నిపుణులు వివరిస్తున్నారు. 2000లో కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్య లాగా 2022లో క్రోమ్ బ్రౌజర్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

 

గూగుల్ క్రోమ్ పని ఖతం

వెర్షన్ అంకెలు పెరగడంతో కొన్ని రకాల వెబ్‌సైట్లు గూగుల్ క్రోమ్ లో సక్రమంగా పని చేయని ఫోర్బ్స్ పేర్కొంది. ఈ సమస్య ఎదుర్కోవడం తప్పదని గూగుల్ కూడా ఒప్పుకుంది. కాకపోతే సాధ్యమైనంత వరకు యూజర్లు ఇబ్బందులు పడకుండా రిలీజ్‌కు ముందే సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తోంది. వర్క్ కాని వెబ్‌సైట్లలో ప్రధానంగా డ్యూడ్‌ ప్లాట్‌ఫాంపై అభివృద్ధి చెందే వెబ్‌సైట్లే ఉండనున్నాయి. క్రోమ్‌-100 తర్వాతి వెర్షన్లలో ఇవి పనిచేయవు. వర్డ్‌ప్రెస్‌, పీహెచ్‌పీ వంటి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని వెబ్సైట్లు పనిచేసి మరికొన్ని పని చేయకపోతే చాలా మంది గూగుల్ క్రోమ్ ని పూర్తిగా పక్కన పెట్టేసే ప్రమాదముంది. దాంతో దాని పని ఖతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువేనని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

ముందు జాగ్రత్త పడుతున్న గూగుల్

ఏయే వెబ్‌సైట్లలో సమస్యలు తలెత్తుతాయో ముందుగానే తెలుసుకుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమస్య కారణంగా క్రోమ్‌ యూజర్లు ఫైర్‌ఫాక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అందుకే గూగుల్ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతానికైతే ఆ దిశగా గూగుల్ చర్యలు చేపడుతోంది. ఈ సమస్యని గూగుల్ అధిగమిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N