Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాని నిజంగా చంపేస్తారా..? కామెంట్స్ అందుకేనా..!?

Share

Vangaveeti Radhakrishna: నేడు దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి అన్న సంగతి తెలిసిందే. ఈ వర్ధంతి సందర్భంగా విజయవాడ వేదికగా కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాలు ఏమిటంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడ కలిశారు. రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ, మంత్రి కొడాలి నాని లు కలిశారు. వీరు ముగ్గురు గుడివాడ సమీపంలో ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి వీరు ముగ్గురు గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరులో జరిగిన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా ఒకే వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా చేసిన పలు కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్షెషనల్ అవుతున్నాయి. అదే విధంగా వంశీ, రాధ ఏకాంతంగా చర్చించుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధ ఏమన్నారంటే .. “నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు. నన్ను మర్డర్ చేయాలని ఒక పార్టీ ప్లాన్ చేస్తోంది. అవి అన్నీ ఆధారాలతో సహా త్వరలో బయటపెడతాను” అని అన్నారు. “నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. ప్రజా జీవితంలోనే ఉంటాను. నాన్న గారి ఆశయాల సాధనకు కృషి చేస్తాను, నాన్న గారు చూపిన బాటలోనే పయనిస్తాను” అని చెబుతూనే తనను చందపడానికి ఎవరో రెక్కీ నిర్వహించారనీ, ఒక పార్టీ ప్రయత్నిస్తోందని మీడియా ముందు కూడా చెప్పారు. ముందుగా వేదిక మీద చెప్పారు. ఆనంతరం మీడియా ముందు ఇవే మాటలు చెప్పారు. త్వరలో వార్ల పేర్లు బయటపెడతాను అన్నారు. ఒక వ్యక్తిని హత్య చేయాలంటే ఎదుటి వ్యక్తికి అత్యంత శతృవుగా అయి ఉండాలి. హత్య అనేది చివరి అంశం. శతృవులకు మొదటి అంశం అతనికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకోవడం. రెండవది అతని సన్నిహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా బెదిరించో, బతిమిలాడో లొంగదీసుకోవడం అప్పటికి కుదరకపోతే అతని చుట్టుపక్కల వారితో రకరకాల వర్గాల ద్వారా ఆయనను బెదిరించడం, భయపెట్డడం, అప్పటికీ లొంగకపోతే చంపేయడం. అడ్డు తొలగించుకోవాలంటే చంపేస్తారు. అది ఎవరైనా పెద్ద వ్యక్తి. ఇక్కడ వంగవీటి రాధా విషయంలో చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఇంతకు ముందు రంగాను హత్య చేశారు. అందుకు ఒక కారణం ఉంది. రంగా ఒక వ్యవస్థ మీద పోరాడారు. కొంత మంది వ్యక్తుల కోసం ఒ పెద్ద వ్యవస్థ మీద పోరాటం చేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో.. అప్పుడు ఆయనను చంపాల్సిన అవసరాన్ని ప్రత్యర్ధులకు కల్పించారు. ఆయన ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో భాగంగా తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా పోరాటాన్ని వదలలేదు. జనం మధ్యలోనే హత్యకు గురైయ్యారు. పరిటాల రవి కూడా హత్యకు గురైయ్యారు. ఆయన కూడా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంతో మంది శతృవులను తయారు చేసుకున్నారు. ఫ్యాక్షన్ గొడవల్లో భాగంగా శతృవులు ఎక్కువగా ఉండటంతో హత్యకు గురైయ్యారు.

Vangaveeti Radhakrishna sesational comments
Vangaveeti Radhakrishna sesational comments

 

Vangaveeti Radhakrishna: రాధాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..?

ఇక్కడ రాధాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. రాధా ఏదైనా వ్యవస్థ మీద తన తండ్రి మాదిరిగా పోరాటం చేస్తున్నారా ? ఆయన తండ్రి లాగా భీభత్సంగా ఉద్యమాలు చేస్తున్నారా ?. తన తండ్రి లాగా పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు ఏమైనా చేస్తున్నారా ? లేదు కదా. లేదా పరిటాల రవి మాదిరిగా ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ఏమైనా ఉన్నారా ? అంటే అదీ లేదు కదా. విజయవాడలో గతంలో మాదిరిగా ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయా ? అంటే అదీ లేదు. కానీ ఇటువంటి తరుణంలో ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఆయన ఒక వ్యవస్థ మీద పోరాటం చేయడం లేదు. ఉద్యమాలు చేయడం లేదు. లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఆయన పెద్దగా ఏమి మాట్లాడటం లేదు. భీభత్సవంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్నో, ఏ పార్టీ మీదనో వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కదా. ఆయన ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఏమైనా స్ట్రాంగ్ గా మాట్లాడారా ? వైసీపీకి ఇరుకున పెట్టేలా మాట్లాడారా? అంటే లేదు. లేదా తను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో ప్రజల్లో ఉద్యమం చేశారా ?  పోరాడారా? పాదయాత్రలు చేశారా? ఇళ్ల పట్టాలు ఇప్పించాలని దీక్షలు చేశారా ? ఏమి చేయలేదుకదా. ఇవేమీ చేయకుండా ఆయనను చంపాల్సిన అవసరం, అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ?. విజయవాడలో ప్రస్తుతం ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా లేవు కదా. తన ఉనికి కోసం, తను ఓ సబ్జెక్ట్ అవ్వడం కోసం, కొన్ని అంతర్గత కారణాలుగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన కు థ్రెట్ అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో లేదనే చెబుతున్నారు. 1988లో అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు విజయవాడలో ఉన్న గొడవలు వేరు. రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ హత్యలు రెండే జరిగాయి. ఒకటి వంగవీటి రంగా, తరువాత పరిటాల రవి. ఇంకా చాలా ఉన్నప్పటికీ రాజకీయ హత్యలు, కుల హత్యల కింద ఈ రెండు వస్తాయి. కాబట్టి హత్యలు జరిగాయి అంటే అప్పటి వాళ్ల చరిత్ర అది. ఒకళ్లది ఫ్యాక్షన్ చరిత్ర, మరొకరిది పోరాటం ఉద్యమ చరిత్ర. రంగాకు ఆ రెండు లేనప్పుడు ఎందకు హత్య చేస్తారు అనేది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న. ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎదుటి వాళ్లకు ఉందీ అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. వివేకానంద రెడ్డిని హత్య చేశారు అంటే ఆ కుటుంబంలో కలహాలు అంతర్గతంగా కొన్ని సెటిల్ మెంట్లు, పంచాయతీల్లో ఆయన ఉన్నారు కాబట్టి చాలా కారణాలతో హత్య చేశారు. రాధ ఏమైనా సెటిల్ మెంట్ లలో పాల్గొన్నారా లేదు కదా, గొడవలు లేవు, పోరాటాలు లేవు, ఉద్యమాలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద గా ఏమీ మాట్లాడటం లేదు. ప్రైవేటు సెటిల్ మెంట్ లు లేవు., భూముల గొడవలు, వివాదాలు లేవు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ లేవు. ఇలా ఏమీ లేనప్పుడు ఎందుకు చంపుతారు.

వారి మధ్య చర్చలు ఏమి సాగాయంటే

ఇక వంశీ, రాధ లు ఏకాంతంగా ఏమి మాట్లాడుకున్నారు అనేది కూడా చర్చనీయాంశం. 2012లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒదార్పు యాత్ర చేస్తున్న సందర్భంగా విజయవాడలో అక్కడ రాధ ఉన్నప్పుడు వల్లభనేని వంశీ వచ్చి జగన్ ను కలిసి కౌగిలించుకున్నారు. అప్పుడు వంశీని పిలిపించింది జగన్మోహనరెడ్డికి పరిచయం చేసింది వంగవీటి రాధానే. అంటే రాధా, వంశీలకు ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి. వాళ్లిద్దరిది మద్య సేహ్నం ఉంది. ఒకే చోట రాజకీయాల్లో ఉండటం, సమాన వయసు గల వారి కాబట్టి మంచి స్నేహం ఉంది. దానికి తోడు రంగాను రాజకీయాలకు అతీతంగా అభిమానిస్తారు కాబట్టి వచ్చారు. కలిశారు. అయితే అంతర్గతంగా ఏమి మాట్లాడుకుంటారు అంటే కశ్చితంగా రాజకీయంగా చాలా అంశాలు ఉన్నాయి. వాళ్లిద్దరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు. మండల స్థాయి, గ్రామ స్థాయి వ్యక్తులు కలిస్తేనే మీ పార్టీ అలా ఉంది, మా పార్టీ ఇలా ఉంది అంటూ రాష్ట్ర రాజకీయ అంశాలను పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. అలానే వీళ్లు మాట్లాడుకుంటే విశేషం ఏమి ఉంది. వంశీ ఈ మధ్య కాలంలో టీడీపీపై ఎక్కువగా మాట్లాడారు కాబట్టి, రాధ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ల మధ్య కొంత చర్చ జరిగితే జరిగి ఉండవచ్చు, అందులో అది విశేషం అయి ఉండవచ్చు. రాష్ట్ర రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీ ఉనికి, అధికార పార్టీ పరిస్థితి ఇలా అనేక విషయాలపై చర్చ జరిగి ఉండవచ్చు.


Share

Related posts

Narendra Modi : మోడీ ఊహించ‌ని కామెంట్స్ చేస్తున్న‌ సీఎం అభ్య‌ర్థి

sridhar

Corona: డ‌బ్బులు ప్రింట్ చేసుకుంటే స‌మ‌స్యే ఉండ‌దు… క‌రోనా స‌మ‌యంలో భ‌లే విశ్లేష‌ణ‌

sridhar

Tollywood: భారీ కాంబోలో అనౌన్స్ అవుతున్న సినిమాలు..పట్టాలెక్కేదెప్పుడో..?

GRK