NewsOrbit
న్యూస్

Mamata Banerjee: దీదీ నేతృత్వంలోని విపక్ష కూటమికి షాక్ ల మీద షాక్ లు.. రాష్ట్రపతి రేసుకు నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ

Mamata Banerjee: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి విపక్షాల సత్తా చాటాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు ముగ్గురు ప్రముఖులు తాము రేసులో నిలబడమని తేల్చి చెప్పేయడంతో మరో సారి సమావేశానికి సిద్ధమవుతున్నారు మమతా బెనర్జీ. తొలుత ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించగా ఆయన నిరాకరించారు. ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని గతంలోనే పవార్ స్పష్టం చేశారు. ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత షరూక్ అబ్దుల్లా కూడా తాను రేసులో ఉండనని ప్రకటించారు. ఈ ఇద్దరు తప్పుకున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ, సీ రాజగోపాల్ రెడ్డి మనువడు, బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.

Gopalkrishna gandhi also declines Mamata Banerjee Plea On Presidential poll
Gopalkrishna gandhi also declines Mamata Banerjee Plea On Presidential poll

 

గోపాలకృష్ణ గాంధీ గతంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక భారత హైకమిషనర్ గా కూడా సేవలు అందించారు. గత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసి వెంకయ్యనాయుడు మీద ఓటమిపాలైయ్యారు. ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీ కూడా విముఖత వ్యక్తం చేశారు.  తన పేరును ప్రతిపాదించిందుకు కృతజ్ఞతలు తెలిపిన గోపాలకృష్ణ గాంధీ.. రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసే వ్యక్తి జాతీయ ఏకాభిప్రాయాన్ని కల్పించేలా, ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా ఉండాలన్నారు. అలాంటి వ్యక్తికే అవకాశం ఇవ్వాలని సూచించారు. విపక్షాల వినతిని తిరస్కరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ఈ నేపథ్యంలో మంగళవారం విపక్షాలు మరో మారు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. శరద్ పవార్ నేతృత్వంలో ఢిల్లీలో విపక్ష నేతల భేటీ జరగనుంది. దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఈ భేటీకి హజరవుతాయని భావిస్తున్నారు. గత వారం సమావేశానికి మమతా బెనర్జీ 22 రాజకీయ పార్టీలకు అహ్వానాలు పంపగా, 16 పార్టీలు హజరైయ్యాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N