guppedentha manasu: రిషిపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన మహేంద్ర…. మరోపక్క రిషి ప్రేమను డిస్టర్బ్ చేస్తున్న గౌతమ్..!!

Share

guppedentha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో రిషి జగతికి అనుకోని షాక్ ఇస్తాడు. వసునూ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పి జగతి మేడం. కి చెప్పి వెళ్ళిపోతాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతిని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్..నీ వెనుకాల ఎవరో ఉన్నారు అని,రిషి ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. ఇక జగతి నన్ను ఎం అడగవద్దు అంటుంది.

Corona Cases: దేశంలో లక్షకుపై చేరిన కరోనా యాక్టివ్ కేసులు..! ఒమిక్రాన్ పరిస్థితి ఏమిటంటే..?

రిషిని తిట్టకనే తిట్టిన మహేంద్ర…:

మరోవైపు రిషి జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా, గౌతమ్ మాత్రం తను గీసే బొమ్మ గురించి వర్ణిస్తూ ఉంటాడు. దానితో.రిషి చిరాకు పడతాడు. ఈలోపు మహేంద్ర రిషి కి కాల్ చేసి మొత్తానికి నువ్వు అనుకున్నదే సాధించావ్ అని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. రిషికి ఏమి అర్ధం కాదు. మరోవైపు వసుధార జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు జగతి అక్కడకు నవ్వుకుంటూ వచ్చి అయిన నేను వెళ్ళమంటే నువ్వు వెళ్లడమేనా నా మనసు గురించి నీకు తెలియదా అని అడుగుతుంది. అసలు మేడం ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటుంది.

Karthika Deepam: ఆవేశంతో రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్….రుద్రాణి కార్తీక్ ను చంపేస్తుందా… పాపం దీప పరిస్థితి ఏంటి..?
వసు జ్ఞాపకాల్లో విహారిస్తున్న రిషి :

మళ్ళీ సీన్ కట్ చేస్తే మరోవైపు రిషి, వసు తో కలిసి దిగిన ఫోటోలు, వసు ఆడిన గోళీలు చూస్తూ తెగ మురిసి పోతూ ఉంటాడు ఈలోపు గౌతమ్ అక్కడకు వచ్చి రిషి డ్రీమ్ చెడగొట్టటంతో పాటు గోళీలను కూడా లాక్కుంటాడు. దాంతో రిషికి కోపం వచ్చి ఆ గోళీలను లాక్కుంటాడు. ఈ గోళీలలో ఏముందిరా అంతగా ఫీల్ అవుతున్నావ్ అని అడుగుతాడు. దాంతో రిషి వసు జ్ఞాపకాలను ఊహించుకుంటూ దీనిలోనే లైఫ్ ఉంది అన్నట్లు డబల్ మీనింగ్ లో అర్ధం కాకుండా ఏదో.చెబుతాడు. కానీ గౌతమ్ కు ఏమీ అర్ధం కాదు.

వసుకి సారీ చెప్పిన జగతి…. మరి వసు రియాక్షన్ ఏంటో…?

మళ్ళీ సీన్ వసుధారా దగ్గర ఓపెన్ అవుతుంది.వసుధార పడుకొని ఉండగా జగతి  అక్కడకు వచ్చి.. వసు తలపై చేతితో నిమురుతూ నన్ను క్షమించు వసు నిన్ను ఇబ్బంది పెట్టక తప్పలేదు అంటూ మనసులో అనుకుంటుంది. ఆ తరువాత కార్డు లో ఎదో రాసి నెమలి పించాలు ఉన్న కుండీకి టాగ్ చేసి వెళ్ళిపోతుంది.వసు నిద్ర లేచి జగతి టాగ్ చేసిన టెక్స్ట్ ని చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది. ఇక జగతి కి కూడా థాంక్స్ చెబుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : షో కి సంబంధించిన లీకులు ఎవరిస్తున్నారో తెలుసా…?

arun kanna

Covid: దేశంలో వ్యాక్సిన్ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక నిర్ణయం..!!

sekhar

చంద్రబాబు ఏపికి రావచ్చు:అనుమతిచ్చిన డీజిపీ

somaraju sharma