NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆడపిల్ల పుట్టిందని అంత పని చేసిన ఓ వ్యక్తి..!

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు ఎంతో భారమని భావించేవారు. కాలం మారుతున్నప్పటికీ కూడా ఆడపిల్లలపై ఉన్న వివక్షత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిందంటే కొంతవరకు ఆ తల్లిదండ్రులలో నిరాశ కనిపిస్తుంటుంది.కానీ మరి కొంతమందిలో మాత్రం ఆడపిల్ల జన్మించింది అంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని భావించి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తనకు కూతురు పుట్టిందని ఆనందంతో ఒక రోజంతా సెలూన్ సేవలను ఉచితంగా అందించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసముండే సల్మాన్ అనే వ్యక్తి సెలూన్ షాపులను నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. సల్మాన్ కు గ్వాలియర్‌లో మూడు సెలూన్ షాపులు ఉన్నాయి. అయితే గత డిసెంబర్ నెల 26వ తేదీన సల్మాన్ భార్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అందరిలా ఆడపిల్ల పుట్టిందని బాధపడకుండా సల్మాన్ తన ఇంటికి అదృష్టదేవత వచ్చిందని ఎంతో సంబరపడిపోయాడు. అయితే తన కూతురు పుట్టిందన్న ఆనందాన్ని విభిన్న రీతిలో సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన సల్మాన్ జనవరి 4వ తేదీన తనకున్న మూడు సెలూన్ షాపులలో ఉచితంగా సేవలు అందిస్తామని బోర్డులు పెట్టించాడు.

అదే విధంగా సల్మాన్ సోమవారం తన మూడు సెలూన్ షాపులలో దాదాపు 80 మంది కస్టమర్లకు ఉచితంగా సెలూన్ సేవలను అందించారు. ఈ విధంగా ఆడపిల్ల పుట్టడం వల్ల ఎంతో ఆనందాన్ని ఇస్తుందనే సందేశాన్ని అందరికీ తెలిసేలా ఈ సేవలు ఏర్పాటు చేసినట్లు సల్మాన్ తెలిపారు. అమ్మాయి పుట్టిందని ఎవరు బాధపడకూడదు. వారిని ఎంతో ఘనంగా మన ఇంటికి ఆహ్వానించాలని ఈ సందర్భంగా సెలూన్ యజమాని సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు నెటిజన్లు సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అమ్మాయి భారం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే సంతోషించేవారు కూడా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N