సాధారణ క్లీనింగ్ లో కొన్నిప్రదేశాలను మాత్రమే శుభ్రంచేస్తుంటాము. అదే డీప్ క్లీనింగ్ లోమాత్రం అతి చిన్న వాటిపై కూడా శ్రద్ధపెట్టి శుభ్రం చేస్తుంటాము. ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఇళ్లలో చాలా ప్రదేశాలను మనం వదిలేస్తుంటాం. అలాంటి చోట బాగా దుమ్ము పేరుకుపోయి క్రిములు చేరి అనేక సమస్యలు వస్తాయి.
డీప్ క్లీనింగ్ చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.మూల మూలల శుభ్రం జరుగుతుంది. ఇల్లు మొత్తం సంపూర్ణంగా పరిశుభ్రమవుతుంది.డీప్ క్లీనింగ్ చేయడం ద్వారా కిచెన్ లోని సింకులు, టైల్స్, కెబినెట్లు,వాష్ బేసిన్లు, చిమ్నీలు,అద్దాలు, అటకలు, ట్యాపులు,స్కర్టింగులు, బాత్ రూమ్ లో పరిశుభ్రమవుతాయి.
డీప్ క్లీనింగ్ ప్రక్రియలో విషరహిత కెమికల్ క్లెన్సర్లు వాడతారు. ఫ్లోర్ పై వ్యాక్యూమింగ్ మోపింగ్ చేయడంతో పాటు కార్పెట్లు, ఫ్లోరింగ్, ఉడ్ వర్క్, కిటీకీలు,లైటింగ్ స్విచ్చులు, గ్లాస్ వర్క్స్ వంటి వాటిపై ఉండే దుమ్ముంతా శుభ్రం చేసుకోవాలి. మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రదేశాల శుభ్రత కోసం ప్రత్యేకమైన రసాయనాలను ఉపయోగించడం జరుగుతుంది.
వంటగది లో పరిశుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాల్లో చాల ముఖ్యమైనది సింక్. సింక్ ను శుభ్రం చేసుకోకుండా వదిలిస్తే దాని వలన వచ్చే క్రిమి, కీటకాల వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సింక్ ను రోజు శుభ్రం చేయాలి. గిన్నెలు, ఇతరత్రా కడిగిన తర్వాత పోసే నీళ్లతో సింక్ శుభ్రం కాదు. క్రిమిరహితంగా కూడా ఉండదు. రోజు కడి గిన కూడా ఎప్పటికప్పుడు సింక్ ను శుభ్రం చేయడం చాలా చాల అవసరం. దీనికి డీప్ క్లీన్ చేయాల్సిన పని లేదు.
సాధారణమైన క్లీనింగ్ సరిపోతుంది. రెండు వారాలకోసారి నిమ్మచెక్క, వెనిగర్ తో కూడిన ఐస్ క్యూబ్స్ డ్రైన్ లో వేయండి. పైపులో ఏమైనా అంటుకొని వుండి పొతే వాటిని ఆ క్యూబ్ పోగొడుతుంది. వీలైతే సింక్ కోసం డ్రైన్ కవర్ కొనండి. సింక్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచడం మంచిది. వంట, భోజనం అయిపోయిన వెంటనే గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంవలన సింకులో క్రిములు చేరకుండా చూసుకోవచ్చు.