ట్రెండింగ్ న్యూస్ సినిమా

రామ్ చరణ్ సినిమా చేస్తాడనుకున్న దర్శకుడి విషయంలో మనసు మార్చుకున్నాడా ..?

Share

రామ్ చరణ్ తో సినిమా చేయాలని గత కొన్ని నెలలుగా పలువురు దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్స్ వరకు చాలామంది ram charan కోసం క్యూలో ఉన్నారు. కాని రామ్ చరణ్ ఇంకా ఏ దర్శకుడితో సినిమా చేయాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR లో నటిస్తున్న ram charan ఈ సినిమా నుంచి మార్చ్ వరకు బయటపడతాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అలాగే ఆచార్య సినిమాలో కూడా చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Ram Charan, Alia Bhatt, Ajay Devgn starrer RRR to be postponed to the  summer of 2021? | Celebrities News – India TV

త్వరలో ఆచార్య సినిమా లో ram charan పార్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ షూటింగ్ కోసం RRR లో జాయిన్ అవుతాడట. అయితే ఏప్రిల్ లేదా మే నుంచి చరణ్ కొత్త ప్రాజెక్ట్ ట్రాక్ లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈ క్రమంలో దర్శకుడు ఎవరన్నది ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. అయితే ram charan సినిమా చేయాలనుకున్న దర్శకులలో తమిళ దర్శకుడు లోకేష్ కనగ రాజన్ కూడా ఉన్నాడు. ‘ఖైదీ’ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకున్నాడు లోకేష్ కనగరాజ్. తాజాగా విజయ్ తో తెరకెక్కించిన “మాస్టర్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం లో విఫలమైంది. రిలీజ్ కి ముంచు ఉన్న అంచనాలన్ని తారుమారయ్యాయి. దాంతో ఇప్పుడు ram charan ఈ దర్శకుడితో సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే జెర్సీ ఫేం గౌతం తిన్ననూరి చరణ్ కోసం వేయిట్ చేస్తున్నాడని అలాగే వెంకీ కుడుముల.. వంశీపైడిపల్లి లైన్ లో ఉన్నారని అంటున్నారు. మరీ వీరిలో ram charan ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు.


Share

Related posts

Ukraine Russia War: ఉక్రెయిన్ లో ప్రముఖ నగరాలను చుట్టముట్టిన రష్యా సేనలు .. ఎంత మంది సైనికులు మృతి చెందారంటే..?

somaraju sharma

nithin : నితిన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు..ఫుల్ హ్యాపీ అంటున్నాడు.

GRK

Eatala Rajender: జ్వరంతో ఈటల అస్వస్థత..! పాదయాత్రకు బ్రేక్..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar