ప్రతి రోజూ బెల్లం ముక్క తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహాఇస్తున్నారు. సహజమైన తియ్యదనం తో ఉండే బెల్లం ముక్క తింటే నిత్యం యవ్వనంగా ఉంటారని తెలియచేస్తున్నారు. రోజు ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే శరీరం అనేక ప్రయోజనకర లాభాలు పొందుతుందని వారు చెబుతున్నారు.అసలు విషయానికి వస్తే చక్కెర తో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ, ఇపుడు చాలామంది బెల్లం కంటే చక్కెర నే ఆహారం లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . బెల్లం నోటికి తీపిని అందించడం తో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడుతుంది.
ఐరన్ తో పాటు మినరల్స్ కూడా బెల్లం లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే బెల్లం ఖచ్చితం గా తీసుకోవడం ఎంతో మంచిది. రక్త హీనత సమస్య నుండి బయట పడాలన్నా కూడా
క్రమం తప్ప కుండ బెల్లం తినాలి. వల్ల జలుబు గా ఉన్నపుడు ఒక ముక్క బెల్లం తిని గోరువెచ్చటి నీరు తాగడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ప్రాథమిక చికిత్స గా పనిచేయడంతో పాటు రోగ నిరోధక శక్తిపెరిగేలా చేస్తుంది .
చర్మం పై ముడతలను,ముఖంపై ఏర్పడే మచ్చల ను పోగొట్టి చక్కని నిగారింపు వచ్చేలా చేస్తుంది. వెంట్రుకలు ఊడిపోయే సమస్య నుంచి కొంత అయినా బయట పడాలంటే రోజూ బెల్లం ముక్క తినడం ఉత్తమం.
దీని కోసం గోరు వెచ్చని నీటి లో బెల్లం కలుపుకుని తాగాలి. పాలు , టీ, కాఫీ ల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే మంచి రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యం పొందవచ్చని డాక్టర్స్ కూడా చెప్పే మాట. కాబట్టి రోజు ఆహారం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క తినండి.