సీఎం క్యాంప్ ఆఫీసులోనే హైకోర్టు

అమరావతి, డిసెంబర్ 28: భవనాలు పూర్తి అయ్యే వరకూ హైకోర్టు సీఎం క్యాంప్ ఆఫీసులోనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన హైకోర్టు ఏర్పాటుపై సమీక్ష జరిపారు. సీఆర్‌డిఏ కమీషనర్, అడ్వకేట్ జనరల్, న్యాయశాఖ కార్యదర్శిలతో సమీక్ష జరిపారు. నేలపపాడులో నిర్మాణంలో  ఉన్న భవనాలు ఎప్పటి వరకూ పూర్తి అవుతాయని అధికారులను అడిగి  తెలుసుకున్నారు. జనవరి 1వ తేదీన హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో హైకోర్టు భవనాల సిద్ధంపై సమీక్ష జరిపారు. జనవరి 22 నాటికి భవనాలు పూర్తి అవుతాయని  నిర్మాణ సంస్థ తెలుపగా అవసరమైతే నేలాఖరు వరకూ సమయం తీసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.