హైదరాబాదీ రియల్టర్, సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు కూడా శ్రీధర్ పలువురిని మోసం చేసిన కేసుల్లో అరెస్టు అయ్యారు. బెయిల్ పై విడుదలై బయట ఉంటున్నారు. తాజాగా బీగ్ బీ అమితాబ్ బచన్ బంధువులను మోసం చేసిన కేసులో శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. ట్రాక్టర్ లు ఇప్పిస్తానని చెప్పి అమితాబ్ బచన్ బంధువు నుండి రూ.250 కోట్లు శ్రీధర్ రావు తీసుకుని మోసం చేశాడు. దీనిపై ఢిల్లీలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో శ్రీధర్ రావుపై కేసు నమోదు అయ్యింది.

ధీంతో ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇంతకు ముందు భవనాల అమ్మకం విషయంలో భారీగా నగదు వసూలు చేసి కొనుగోలుదారులను మోసం చేసినట్లు గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పోలీసు స్టేషన్ లలో బాధితులు ఫిర్యాదు చేశారు. అనేక కేసుల్లో అరెస్టు అవ్వడం, బెయిల్ పై బయటకు రావడం శ్రీధర్ రావుకు అలవాటుగా మారిందని బాధితులు పేర్కొంటున్నారు.
నీచ రాజకీయాలు అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్