ఓహో.. మగాళ్లు పెళ్లయ్యాక లుంగీ అందుకు కట్టుకుంటారా? హైపర్ ఆది సూపర్ పంచ్

ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అయితే ఈసారి ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా హైపర్ ఆది అలరించాడు. రాకింగ్ రాకేశ్ టీంలో ప్రత్యక్షమయ్యాడు. నిజానికి హైపర్ ఆది లేకుంటే జబర్దస్త్ షోనే ఉండదు. హైపర్ ఆదికి ప్రస్తుతం ఉన్న పాపులారిటీ అటువంటిది.

hyper aadi punches in jabardasth show
hyper aadi punches in jabardasth show

కేవలం హైపర్ ఆది స్కిట్ల కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు బోలెడు. ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ ను చూస్తారు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఈ రెండు టీమ్ లో ఫేమస్.

ఇక.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ప్రత్యక్షమైన హైపర్ ఆది.. రాకింగ్ రాకేశ్ టీంలో కూడా పంచ్ ల మీద పంచ్ లు వేశాడు. రాకింగ్ రాకేశ్ కు మామ పాత్రలో నటించిన హైపర్ ఆది.. రాకింగ్ రాకేశ్ అడిగిన డౌట్ కు భలే క్లారిఫికేషన్ ఇస్తాడు.

పెళ్లయిన మగాళ్లంతా ఎందుకు లుంగీలు కట్టుకుంటారు మామయ్యా అంటూ రాకింగ్ రాకేశ్.. హైపర్ ఆదిని అడుగుతాడు. దీంతో.. వెంటనే అందుకున్న ఆది.. పెళ్లయ్యాక ఊపిరి ఎలాగూ ఆడదు కదా.. గాలి అయినా అడుతుంది అని.. పంచ్ వేయగానే సెట్ లో నవ్వులే నవ్వులు.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..