ఈ నూనెతో వంట చేస్తున్నారా? అయితే మీ ప్రాణాలు పోయినట్టే!

వంట చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క రకం నూనెను వినియోగిస్తారు. అందులో ఏది మంచిదో ఏది చెడో కూడా తెలుసుకోకుండా వినియోగించేస్తుంటాము. ముఖ్యంగా టీవీల్లో చూపించే యాడ్ ను చూసే కొందరు వాటిని వినియోగించేస్తుంటారు. మరి మీరు వాడుతున్న నూనె మీ ఆరోగ్యం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో తెలుసుకోండి ఇకనైనా.. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక వార్త.. మీరు వాడే నూనె మీ ఆరోగ్యం పై ఏవిధంగా ప్రభావితమవుతుందో ఇటీవలె జరిపిన పరిశోధనల్లో తెలిసింది. మీరు వాడే నూనెల్లో ఈ నూనె ఉంటే ప్రమాదమేనని అంటున్నారు పరిశోధకులు.

గత అధ్యయనాలను పరిశీలించినట్టయితే.. మనం ఆరోగ్యకరం అని భావిస్తున్న ఆవనూనే మెదడుకు మంచిది కాదని తెలిసింది. దాని మూలంగా జ్ఞాపక శక్తి తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇన్నాళ్లు ఈ నూనెతో ఆరోగ్యం శ్రేయస్కరమనే అనుకున్నాం. దీనితో ఈ నూనెకు కూడా మార్కెట్ లో మంచి గిరాకీ కూడా ఉంది. కాని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన లూయిస్ క్యట్జ్ స్కూల్ ఆఫ్ మెడిసిన(LKSOM) జరిపిన పరిశోధనల్లో ఆవనూనెను ఎక్కువగా వాడటం మూలంగా జ్ఞాపక శక్తి తగ్గుతుందని తేలింది.

సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ఈ పరిశోధనలకు సంబంధించిన కీలక వివరాలను ప్రచురించారు. ఆవనూనే ను ఎక్కువగా వాడితే జ్ఞాపక శక్తి తగ్గుతుందని, నేర్చుకునే సామర్థ్యం కోల్పోతామని తేలింది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలను గుర్తించామని తెలిపారు. వాటికి రోజూ రెండు స్పూన్ల నూనెను ఇవ్వడం వల్ల ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. ఈ నూనె వాడకం మూలంగా ఎలుకల్లో మెదడుకు హాని కలుగడమే కాకుండా, వాటి శరీర బరువు కూడా పెరిగిందని తెలిపారు.

ఈ నూనె వల్ల అల్జీమర్ వ్యాధికి గురైనట్టు కూడా తెలుసుకున్నారు. ఆవనూనె ప్రభావం మూలంగా న్యూరాన్ల పనితీరు దెబ్బతిని, జ్ఞాపక శక్తి తగ్గుతుందన్నారు. ఇదిలా ఉంటే ఆలివ్ నూనెతో మెమొరీ పవర్ పెరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఆవనూనె ఆరోగ్యానికి మంచిదనే వార్తల మూలంగా ప్రజలు దీనిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పటికైనా ఈ నూనె వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి వాడకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.