న్యూస్ హెల్త్

ఏ లోహపు పాత్రలో వంటచేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా??

ఏ లోహపు పాత్రలో వంటచేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా??
Share

ఏ లోహం తో  చేసిన పాత్రలో  వంట చేస్తే మంచిదో తెలుసుకుందాం. రాగి పాత్రలు నీటిని నిల్వచేసుకోటానికి లేదా వంటచేసుకోవడానికి ఉత్తమమైన లోహం గా చెప్పబడింది.ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. కానీ  ఉప్పగా ఉండే ఆహారాన్నిరాగి పాత్రలో వండటం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఉప్పులో ఉండే అయోడిన్ రాగితో త్వరగా స్పందిస్తుంది. ఇది ఎక్కువ రాగి కణాలను విడుదల చేస్తుంది. కాబట్టి రాగి  పాత్రలలో వంట చేయాలనుకున్నప్పుడు ఉప్పు కంటెంట్ లేనివి మాత్రమే చేయాలి.

ఏ లోహపు పాత్రలో వంటచేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా??

సాధారణంగా మనం ఇంటిలో ఉపయోగించే  మరొక పాత్ర అల్యూమినియం. అల్యూమినియం చాలా త్వరగా వేడి అవుతుంది. ఆమ్లాల్ని కలిగి వున్న కూరగాయలు, ఆహారాలతో ఇదివెంటనే స్పందిస్తుంది. కాబట్టి అలాంటి పాత్రలలో వంట చేయకుండా ఉండటం ఉత్తమం. ఇత్తడి పాత్ర లో వండుకోవడం, తినడం మంచిదని భావిస్తూ ఉంటాము. అయితే, వంట చేయడం తో పోలిస్తే ఇత్తడి పాత్రలో తినడం అంత హానికరం కాదు అనే చెప్పాలి. ఇత్తడి వంటకోసం వేడి చేసినప్పుడు ఉప్పు, పులుపు  ఆహారాలతో సులభంగా స్పందిస్తుంది. అందువల్ల, ఇత్తడి  పాత్రలలో వంట చేయకూడదు.

స్టెయిన్లెస్ స్టీల్ సాధారణం గా వంట కోసం ఉపయోగిస్తూ ఉంటాము. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే స్టెయిన్లెస్ స్టీల్ క్రోమియం, నికెల్, సిలికాన్, కార్బన్  ల మిశ్రమం. అయినప్పటికీ, స్టెయిన్లెస్ స్టీల్ యాసిడ్ ఆహారాలతో స్పందించదు. మీరు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కొనాలనుకున్నప్పుడు, దాని క్వాలిటీ చూసుకోవాలిసిందే.. ఎందుకంటే ఇది సరైన స్టీల్ కాకపోతే ఆరోగ్యానికి హానికరం గా ఉంటుంది. కాబట్టి, వంటకు అధిక నాణ్యత, మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల ను మాత్రమే ఎంచుకోవాలి.

ఇతర పాత్రల కాకుండా, ఐరన్ వంట సామగ్రి మంచిదని చెప్పవచ్చు. ఇది సహజం గా ఇనుమును విడుదల చేస్తుంది కాబట్టి ఇది శరీరం యొక్క పనితీరుకు అవసరం. మన పెద్దవారు కూడా ఇనుప పాత్రలలో వంట చేసేవారని చాలామందికి తెలుసు. ఇవి ఆరోగ్యానికి మంచిదని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. ఎందుకంటే ఇది గర్భంలో శిశువు అభివృద్ధి చెందడానికి  సైతం అవసరమైన పోషకాలను ఉత్తమంగా అందిస్తుంది.కాబట్టి సందేహం లేకుండా దీనిని ఉపయోగించవచ్చు.


Share

Related posts

బద్ధకం వీడు హైద్రాబాద్ : ఓటింగ్లో కొత్త రికార్డు

Special Bureau

సీఎం కే సీరియస్ వార్నింగ్!పంజాబ్ ను వణికిస్తున్న వాల్ పోస్టర్!!

Yandamuri

‘టిక్ టాక్’కు టాటా చెప్పేయడమేనా.. కేంద్రం నిర్ణయమిదేనా!

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar