NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jana Reddy : జానారెడ్డి గెలిస్తే జస్ట్ ఎమ్మెల్యేనే కాదు.. అంతకు మించి !ఎలాగంటారా ?

Jana Reddy : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలవేళ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే ఎన్నికల అనంతరం రాష్ట్ర పార్టీలో భారీ మార్పులుంటాయని, ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద ఇటీవల కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. గాంధీభవన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలిస్తే, ఆయన్నే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది.

If Jana reddy wins, he will not be just an MLA .. beyond that! How?
If Jana reddy wins, he will not be just an MLA .. beyond that! How?

టీపీసీసీ అధ్యక్షుడి నియామకం లో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. ‘పెద్దాయన’అనే మంత్రంతో జానాను తెరపైకి తెచ్చి ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా కార్యక్రమాన్ని ముగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను కూడా జానారెడ్డికి అప్పగించి, ప్రత్యామ్నాయ నేతగా ప్రతిపాదించి, ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆయనైతే అందరికీ ఓకే

టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్‌ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించినా, ఇటీవల 10 జన్‌పథ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ గురించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా అధిష్టానంలోని ముఖ్య నాయకులతో ఇదే విషయమై చర్చించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో కీలక భూమిక పోషించిన మరో పెద్దాయన సూచన మేరకు ఈ ప్రతిపాదన పార్టీ ముందుంచి అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారనే గుసగుసలు కాంగ్రెస్‌ పార్టీలో వినిపిస్తున్నాయి.

ఆయన ఏమి చెప్పారంటే !

‘రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష వ్యవహారం తలనొప్పిగా మారింది.ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు అసలే కనిపించడం లేదు. జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్‌. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎల్పీ నాయకుడిని చేయాలి. కానీ, ఆ పదవిలో దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. దళితుడిని ఆ పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాగని ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పీసీసీ హోదాలో మరో నేతను కూర్చోబెట్టడం ఆయన స్థాయికి తగింది కాదు. పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉంది.పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కాదనలేరు. వారికి ఇంకో రూపంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు అధిష్టానం పని కూడా సులువవుతుంది.’అని ఆయన రాహుల్‌ అండ్‌ టీమ్‌కు వివరించినట్టు చర్చ జరుగుతోంది. అంతా విన్న 10 జన్‌పథ్‌ ముఖ్య నేతలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, ముందు నాగార్జునసాగర్‌లో గెలిచి రావాలని చెప్పినట్టు సమాచారం.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N