IND v ENG : భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత రాజకీయనేత గానే కాకుండా హిందీలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు అతను చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అవుతుంటాయి.

ఇండియన్ క్రికెట్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు భారత ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ లతో గంభీర్కు గతంలో గొడవలు ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు వారిని ఉద్దేశించి గంభీర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. వారి ప్రదర్శన బాగున్నప్పుడు పొగుడుతాడు కూడా అనుకోండి అది వేరే విషయం.
ఇక నిన్న టి20 మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీ20ల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అని గంభీర్ చెప్పడం గమనార్హం. అయితే కోహ్లీ, కె ఎల్ రాహుల్ ల తో పోలిస్తే… టి20 ల లో రోహిత్ శర్మ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంటుంది. వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ అత్యుత్తమ బ్యాట్స్మన్ అయినప్పటికీ… తన దృష్టిలో టి20ల్లో కూడా అతనే అత్యుత్తమ ప్లేయర్ అని అన్నాడు.
అయితే అతనితో పాటుగా నిన్న భారత్ బౌలింగ్ ను తుత్తినియలు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్జాస్ బట్లర్ కూడా మొదటి స్థానంలో ఉన్నాడని గంభీర్ చెప్పాడు. తనకైతే పొట్టి ఫార్మాట్ లో వీరిద్దరే అత్యుత్తమం అని గంభీర్ అనడం గమనార్హం.