భారత్ 622/7 డిక్లెర్

సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ను భారత్ 622/7 వద్ద డిక్లేర్ చేసింది. 81 పరుగుల చేసిన జడేజా లయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. రిషభ్ పంత్ 159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యత సాధించిన సంగతి తెలిసిందే.

629 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరుతో భారత్ ఈ టెస్టులో పరాజయం పాలయ్యే అవకాశం దాదాపుగా లేదు. ఈ టెస్ట్ డ్రాగా ముగిసినా భారత్ తొలిసారి అస్ట్రేలియా గడ్డపై సిరీస్ సాధించి చరిత్ర సృష్టించడం ఖాయం. రెండో రోజు ఆటలో మరో పది ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.