భారత్ -పాక్ నూక్లియర్ కేంద్రాల వివరాల మార్పిడి

52 views

భారత్- పాక్ ల మధ్య నిత్య ఉద్రిక్తతలతో సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్న తరుణంలో శాంతికి చిరు వెలుగు కనిపించింది. ఇరు దేశాలూ తమతమ దేశాలలోని నూక్లియర్ కేంద్రాల జాబితాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు. న్యూక్లియర్‌ కేంద్రాలు, సౌకర్యాలపై దాడుల నిరోధానికి సంబంధించి భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్‌ 2 ప్రకారం ఈ మార్పిడి జరిగింది.

పాకిస్థాన్ తమ దేశంలోని నూక్లియర్ కేంద్రాల వివరాలను ఒప్పందం ప్రకారం భారత్ కు అందజేయగా, భారత్ కూడా ఇక్కడి నూక్లియర్ కేంద్రాల వివరాలను పాకిస్థాన్ కు అందజేసింది.  కాల్పుల విమరణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ భారత్ లోని ఉగ్రవాదుల చొరబాట్లకు ఊతమిస్తున్న పాకిస్థాన్..ఈ ఒప్పందాన్నైనా ఉల్లంఘించకండా తు.చ. తప్పకుండా పాటించాలని కోరుకుందాం.