ఫెడరల్ ఫ్రంటా..అసాధ్యం!

61 views

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ సాకారం కావడం అసాధ్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన కూటమి కట్టడానికి కొన్ని కనీస ప్రాతిపదికలు ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అయితే కేసీఆర్ చెబుతున్నవి ఏవీ కూడా నిర్దుష్టమైన సమస్యలు కావని అన్నారు. అయినా అసలు ఫెడరల్ ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న కేసీఆర్ వెనుక ఎవరున్నారో, ఆయనీ అర్భాటం అంతా ఎందుకు చేస్తున్నారో తెలియాల్సి ఉందని కోదండరామ్ అన్నారు.

పార్లమెంటు ఎన్నికలలో  రైతాంగ సమస్యలు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి అంశాలే కీలకంగా ఉంటాయని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ రైతు సమస్యల పరిష్కారంలో ఒక పార్శ్వం మాత్రమే తప్ప అదే అంతిమం కాదని, గిట్టుబాటు ధర, నష్టపరిహారం వంటికి కూడా అత్యంత ప్రధానమైన అంశాలని పేర్కొన్నారు.