ఎక్కువ మంది ప్రయాణాలకు ఫోర్ వీలర్లను వాడటానికి ఇష్టపడుతుంటారు. వాహనదారుల ఆసక్తులు, అవసరాలను బట్టి కార్ల కంపెనీలు కూడా కొత్త మోడల్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. పేరున్న కంపెనీలు ప్రతి ఏటా ఎన్ని కార్లు తయారు చేస్తున్నాయని తెలుసుకుంది ‘మనిషేక్’ సంస్థ.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 కోట్ల కార్లు తయారవుతున్నాయి. నిమిషానికి ఎన్ని కార్లు తయారవుతున్నాయి.. కంపెనీల ఆదాయం తదితర వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా.. ఐదవ అతిపెద్ద కార్ల తయారీ దేశంగా భారత్ నిలిచింది.
దేశాలవారిగా చైనాలో ప్రతి నిమిషానికి సగటున 48.9 వాహనాలు తయారవుతున్నాయి. అదే భారత్ లో 8.6 నమోదవుతుండగా ఈ సంఖ్య భారతదేశం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. రెండవ స్థానంలో అమెరికా,
20, మూడవ స్థానంలో జపాన్ 18.4, నాల్గవ స్థానంలో జర్మనీ 8.9 ఉత్పత్తి చేస్తున్నాయి.
కంపెనీల వారీగా కార్ల ఉత్పత్తిలో టయోట కంపనీ నిమిషానికి సగటున 19.9 వాహనాలను తయారుచేస్తూ మొదటి స్థానంలో ఉంది. జపాన్ కు చెందిన ఈ సంస్థ సంవత్సరానికి 1.04 కోట్ల కార్లను తయారుచేస్తుండగా.. రోజుకి 28 వేల వాహనాలను తయారుచేస్తుంది. రెండవ స్థానంలో వోక్స్ వ్యాగన్ 19.8, హుందయ్ 13.7, జనరల్ మోటర్స్ 13.0, ఫోర్డ్ 12.2 ఇలా ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆదాయంలో టయోట(3,92,51,602), వోక్స్ వ్యాగన్(3,85,09,929) కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నిమిషానికి ఐదు లక్షల డాలర్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నాయి. మూడవ స్థానంలో డైమ్లర్(2,64,75,613), నాల్గవ స్థానంలో ఫోర్డ్(2,09,76,170), ఐదవ స్థానంలో హోండా(1,99,26,618) ఉన్నాయి.