NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: కోల్‌కతా పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం..! మెరిసిన మోరిస్, శాంసన్

IPL 2021: KKR vs rr Samson and morris shines

IPL 2021: ఐపీఎల్ 2021 18వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్…. కోల్కతా నైట్ రైడర్స్ పైన ఘనవిజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

 

IPL 2021: KKR vs rr Samson and morris shines
IPL 2021: KKR vs RR

అలా మొదట బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా నైట్రైడర్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు రాణా, గిల్ స్కోర్ బోర్డు ని పరుగుళెత్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మొదటి ఆరు ఓవర్లలో కేవలం 25 మాత్రమే జోడించిన వీరిద్దరూ త్వరగానే వెనుదిరిగారు. 

అయితే రాహుల్ త్రిపాఠి 26 బంతుల్లో 37 పరుగులతో జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మిడిలార్డర్ నుండి కనీస సహకారం కరువు అవ్వడంతో అతను కూడా చివరికి వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్ 24 బంతులు 25 పరుగులు చేసినప్పటికీ స్కోరుబోర్డు కి వేగం అందించలేకపోయాడు. రసెల్ విఫలం కావడంతో కోల్‌కతా భారీ స్కోరు పై ఆశలు వదులుకుంది. రాజస్థాన్ బౌలర్లలో సౌత్ ఆఫ్రికా పేసర్ మోరిస్ నాలుగు వికెట్లు తీసుకుని మంచి ప్రదర్శన కనబరిచాడు. 

బదులుగా ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభం ఇచ్చాడు. మొదటి ఆరు ఓవర్లలో రాజస్థాన్ జట్టు 50 పరుగులు సాధించింది. ముఖ్యంగా జైస్వాల్ అద్భుతమైన స్ట్రోక్ ప్లే తో రెచ్చిపోయాడు. రెండు వికెట్లు పడిన తర్వాత కోల్‌కతా మ్యాచ్ ను తిప్పుతుందేమో అని అందరూ ఆశించారు.

అయితే రాజస్థాన్ కెప్టెన్ sanju samson తన శైలికి భిన్నంగా నింపాదిగా ఆడుతూ 42 పరుగులతో చివరి వరకు ఉండి రాజస్థాన్ విజయాన్ని పూర్తిచేశాడు. అతనికి శివం దుబే (22), డేవిడ్ మిల్లర్ (24) కావలసిన సహకారాన్ని అందించారు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకోగా ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ వికెట్ తీసుకున్నాడు. ఎంతో సునాయాసంగా రాజస్థాన్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N