అమలా పాల్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే. కాని క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. మెగా హీరోలు రాం చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసింది. అయితే టాలీవుడ్ లో వరసగా ఆఫర్లు దక్కించుకోవడంలో..స్టార్ హీరోయిన్ అవడంలో ఫేయిల్ అయిందనే చెప్పాలి. టాలెంట్ ఉన్నా కూడా ఎందుకనో మిగతా హీరోయిన్స్ తాకిడి తట్టుకోలేక రేస్ లో వెనకపడిపోయింది. అయితే కోలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇటీవల తెలుగు, తమిళంలో అమలా పాల్ నటించిన ఆమె సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ క్రమంలోనే అమలాపాల్ కి మరిన్ని అవకాశాలొస్తున్నాయని సమాచారం. ఇప్పటికే తెలుగులో లస్ట్ స్టోరీస్ లో అమలా పాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఒక మలయాళ సినిమా తో పాటు రెండు తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇక కరోనా తో.. చాలామమంది డిజిటల్ స్ట్రీమింగ్ వైపే ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు యూ టర్న్ తీసుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.
స్టార్ హీరోయిన్స్ కి ఈ వెబ్ సిరీస్ లలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత, కాజల్, తమన్న, ప్రియమణి లాంటి వాళ్ళు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ లిస్ట్ లో అమలాపాల్ కూడా చేరిందట. రీసెంట్ గా వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించిందని సమాచారం. తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్న ఒక బోల్డ్ వెబ్ సిరీస్లో అమలా పాల్ నటించబోతుందట. ఈ కథ 1970 కాలం బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని.. తమిళంలోని ఓ పాత నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని తెలుస్తోంది. అలాగే హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లోను అమలాపాల్ నటిస్తోంది. మొత్తానికి అమలా పాల్ కి వెబ్ సిరీస్ లు బాగానే కలిసొచ్చేలా ఉన్నాయి.