NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ISRO: జీఎస్ఎల్వీ – ఎఫ్ 14 రాకెట్ ప్రయోగం సక్సెస్

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ సెంటర్ షార్ నుండి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ – ఎఫ్ 14 రాకెట్ .. ఇన్సాట్ – 3 డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.

2,275 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్ – 3 డీఎస్ ను వాతావరణ పరిశీలనలను మెరుగుపర్చడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి ఊపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం  కక్ష్యలోని ఇన్సాట్ – 3 డీ, ఇన్సాట్ – 3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పని చేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.

గతంలో ప్రయోగించిన ఇన్సాట్ – 3, ఇన్సాట్ – 3డీఆర్ ఉప గ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ – 3డీఎస్ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో శాటిలైట్ ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజుల పాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి మారుస్తారు.

TS Assembly: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ..అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై వాడివేడిగా వాదనలు

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?