NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS Assembly: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ..అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై వాడివేడిగా వాదనలు

TS Assembly: సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్వేత పత్రంపై మాటల యుద్దం జరిగింది. మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని అధికారపక్షం కార్నర్ చేసింది. తప్పు మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు దిగింది. మంత్రి విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ లు ఇచ్చారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటు నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 2014- 23 మధ్య ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని..ఒక్కో ఒకరానికి అయిన ఖర్చు రూ.11 లక్షలు అని చెప్పుకొచ్చారు. గతంలో పోలిస్తే ఒక్కో ఎకరానికి 12 రెట్లు పెరిగిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి రూ.1.75 కోట్లు కావాలన్నారు. తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని ఆరోపించారు. గత పాలకులు ఇంజనీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల్లో న్యాయబద్దంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారని అన్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయన్నారు. కేసిఆర్ విధానాల వల్లే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, టెక్నీషియన్ ను బయటకు పంపాలని హరీష్ రావు స్పీకర్ ను కోరారు. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదని, అడ్వొకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావొద్దు. టెక్నీషియన్ ను సభలోకి అనుమతించవద్దు, టెక్నిషియన్ ను బ యటకు పంపి మంత్రి పవన్ పాయింట్ ప్రజెంటేష్ ఇవ్వాలన్నారు హరిష్ రావు.  స్పీకర్ అనుమతితోనే టెక్నిషియన్ సభలోకి వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొంటూ, గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం టెక్నీషియన్ ద్వారానే ఇచ్చారని గుర్తు చేశారు. స్పీకర్ మాట్లాడుతూ అన్ని రికార్డులు పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించాని, గతంలో సీఎంగా కేసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నిషియన్ ఉన్నాడని స్పీకర్ అన్నారు. తనను ఎవరు ప్రశ్నించవద్దని అన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అన్నారు. సభ్యుల కు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. కాళేశ్వరం లో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని, అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో మడేళ్లకే దెబ్బతిందన్నారు. రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి నిర్మాణానికి రూ.4వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టు కు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు. ప్రాజక్టు నిర్మాణం నాశిరకంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చిందన్నారు. అక్టోబర్ లో మేడిగడ్డ కుంగితే కేసిఆర్ ఇప్పటి దాకా స్పందించలేదన్నారు. గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్ .. డిజైనర్ అని వ్యాఖ్యానించారు.

గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదన్నారు. ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదాగా జరగలేదన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84 వేల కోట్ల నిధులు లోన్స్ రూపంలో తెచ్చారన్నారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళ్లల్లో రూ.1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మంత్రి ఉత్తమ్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రం సత్యదూరంగా ఉందని అన్నారు. మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారన్నారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే శ్వేతపత్రం ప్రవేశపెట్టారన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు మా హయాంలోనే పూర్తి చేశామన్నారు. సభను ఉత్తమ్ తప్పు దోవ పట్టించే యత్నం చేశారన్నారు. ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారన్నారు హరిష్ రావు.

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు తాము ఒప్పుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ ప్రచారం చేసినట్లే సభలోనూ గొబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు లెక్కలతో గత పర్భుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు చెప్పిందే పదేపదే చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కేసిఆర్, జగన్ చాలా సార్లు నీటి వాటాపై చర్చించారన్నారు. అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు అగేదన్నారు మంత్రి ఉత్తమ్.  

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆ విషయం కాగ్ కూడా చెప్పిందన్నారు. ఉత్తమ్ చెప్పిన విషయాలన్నీ నిజమని ఒప్పుకోవాలన్నారు. ఇంకా సమర్ధించుకోవడం కాదు కూలిన దానికి తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. మేడిగడ్డ ఒక్కటే కాదు మిగతా రెండు నాణ్యత లేవని ఎన్డీఎస్ఏ తేల్చిందన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ మాట్లాడిన ప్రతి సారి అబద్దాలే చెబుతున్నారన్నారు. అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్దమని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అవినీతి, అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ను తాము మార్చాలను కోలేదన్నారు. ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీడిజైనింగ్ చేశామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక భుగర్బ వనరులు పెరిగియాని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలసవలు వస్తున్నారని హరిష్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణాజలాల్లో ఎక్కువ దోపిడీ జరిగిందన్నారు. హరీష్ రావు అన్ని అబద్దాలే చెబుతున్నారన్నారు. గోబెల్స్ హరీష్ రావు అని పేరు పెట్టుకోండని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ . ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక అన్యాయం మరింతగా జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే అన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసిఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే బారిన పడింది తమ కాంగ్రెస్ ఎంపీలేనని అన్నారు. గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదికలోని వివరాలు సభ ముందు ఉంచుతున్నాన్నారు.

ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తొందని అన్నారు. వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. తప్పు ఒప్పుకోవాలని, కప్పిపుచ్చుకోవద్దని సూచించారు. కేసిఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత – చేవెళ్ల సాధ్యమని నివేదక ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కట్టాలన్నది కేసిఆర్ ఆలోచన అని అన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పిందన్నారు. హరీష్ రావు, వాళ్ల మా కేసిఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారని విమర్శించారు.

హరీష్ రావు కల్పించుకుని సీఎం తమను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. సీడబ్ల్యుసీ సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత – చేవెళ్ల కు ఒప్పుకోలేదన్నారు. గతంలో దేవాదుల పైపులు పగిలాయి, టెన్నెల్స్ కూలాయి అని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ యేనన్నారు. మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు .. రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు. కేసిఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేమని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని కాదని, తెలంగాణకు కళంకంగా మారిందన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారన్నారు. సాగునీటి మంత్రిగా హరీష్ రావును ఎందుకు తప్పించారన్నారు. ఈ పాపాలన్నింటికి హరీష్, కేసిఆర్ కారణమన్నారు. తెలంగాణను చెదలు పట్టించారన్నారు.

Breaking: తమిళనాడు బాణాసంచా తాయారీ కేంద్రంలో భారీ పేలుడు ..తొమ్మిది మంది సజీవ దహనం..పలువురికి గాయాలు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju