NewsOrbit
న్యూస్

‘పోలింగ్‌పై పవన్ పోస్టుమార్టం’

 

అమరావతి: ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలింగ్ సరళిపై సమీక్షా సమావేశం జరిపారు. నియోజకవర్గాల వారీగా జనసేనకు లభించిన ఓట్ల శాతం గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. మరో 11రోజులలో ఎన్నికల ఫలితాలు వెల్లడి అవ్వనున్న నేపథ్యంలో పోలింగ్ తరువాత మొట్టమెదటి సారిగా పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయి అంటే తమకు ఇన్ని స్థానాలు వస్తాయి,అధికారం కైవసం చేసుకోబోతున్నామంటూ ప్రకటించుకున్నా  జనసేన ఇప్పటి వరకూ ఇన్ని స్థానాల్లో కైవసం చేసుకుంటామని ప్రకటించలేదు.

అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ఓటర్లను  ప్రలోభపెట్టేందుకు అనేక రకాలు వ్యూహాలను రచించుకున్నా జనసేన మాత్రం జిరో బడ్జెట్ పాలిటిక్స్ అజెండాతోనే ముందుకు సాగింది. ఈ కారణంగా నియోజకవర్గాల్లో  పోలింగ్ సరళి, అంచనాలపై అభ్యర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఏజంట్‌ల నియామకం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సూచనలు చేసినట్లు సమాచారం.

అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు డబ్బులతో ప్రలోభాలకు గురి చేసినా కొన్నివర్గాలకు చెందిన ప్రజలు, యువత, మహిళలు సమాజం, రాజకీయాల్లో మార్పు కోసం నిలబడిన జనసేనను ఆదరించారనీ పలువురు అభ్యర్థులు తెలియజేసినట్లు సమాచారం.

గెలుపు ఓటములను పట్టించుకోకుండా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై జనసైనికులు దృష్టి సారించాలనీ, రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.

ఈ సమావేశంలో నేతలు మాదాసు గంగాధరం, నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారధి, హరిప్రసాద్, డిఎంఆర్ శేఖర్, రాపాల వరప్రసాద్ తదితర ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Leave a Comment