జెఇఇ మెయిన్స్ టాపర్ అరెస్టు..! పరీక్షలో ప్రాక్సీ ని ఉపయోగించారట..!!

 

 

దేశంలోని ఐఐటీ కళాశాలలో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఎంతో కట్టుదిట్టం అయినా భద్రత చర్యలతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. అయితే ఈ సంవత్సరం జరిగిన పరీక్షలో టాపర్ గా నిల్చిన అభ్యర్థి నీల్ నక్షత్ర దాస్, పరీక్షలో ప్రాక్సీ ని ఉపయోగించి అనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసారు.

సెప్టెంబర్ 5న జరిగిన, ప్రతిష్టాత్మక ఐఐటిలతో సహా భారతదేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఆధారం అయిన జెఇఇ మెయిన్స్ పరీక్షలో అస్సాంలోని గౌహతి ప్రాంతానికి చెందిన నిల్ అంకిత్ దాస్ పరీక్ష లో 99.8 శాతం మెరిట్ స్థానాన్ని సాధించాడు. అయితే ఈ పరీక్ష లో అతని తరపున పరీక్షకు హాజరు కావడానికి ప్రాక్సీని ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో అజారా పోలీసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అభ్యర్థి నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మోయ్ దాస్, పరీక్షా కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు – హమేంద్ర నాథ్ శర్మ, ప్రాంజల్ కలిత, హిరులాల్ పాథక్లను అరెస్టు చేసి, వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

నిందితుడు పరీక్షలో అగ్రస్థానంలో ఉండటానికి అన్యాయమైన మార్గాలను ఉపయోగించాడని
సోషల్ మీడియాలో వైరల్ అయినా ఫోన్ కాల్ రికార్డింగ్ మరియు వాట్సాప్ చాట్ ద్వారా మొత్తం రాకెట్ వెలుగులోకి రావడంతో, సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ మిత్రాదేవ్ శర్మ అనే వ్యక్తి ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బోర్జార్ వద్ద విమానాశ్రయానికి సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రం యొక్క ఇన్విజిలేటర్, మోసం చేయడంలో జెఇఇ ఆశావాదికి సహాయం చేసిందని పోలీసులు తెలిపారు. పరీక్షా రోజున నిందితుడు తన పేరు మరియు రోల్ నంబర్‌ను జవాబు పత్రంలో నింపడానికి ఆన్‌లైన్ టెస్టింగ్ సెంటర్ లోపలికి వెళ్లాడని, పరీక్షను బయట ప్రాక్సీ రాసినట్లు పోలీసులు తెలిపారు.

మేము కేసును విచారిస్తున్నాము, మధ్యవర్తిగా వ్యవహరించిన మరొక ఏజెన్సీ సహాయం ద్వారా అభ్యర్థి ప్రాక్సీని ఉపయోగించారని కనుగొన్నాము. అభ్యర్థి తల్లిదండ్రులు పరీక్షకు సహాయం చేయడానికి నగరంలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌కు 15-20 లక్షలు చెల్లించారని పోలీసులు తెలిపారు. పరీక్షా కేంద్రం సిబ్బంది కూడా ఇందులో భాగస్వాములు అనే అనుమానం ఉంది అని, నేరానికి పాల్పడినవారి కోసం శోధిస్తున్నాము అని గౌహతి పోలీస్ కమిషనర్ ఎంపి గుప్తా తెలిపారు.

పరీక్షా కేంద్రాన్ని మూసివేసి, జెఇఇ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన డేటా కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంప్రదించాము” అని గౌహతి అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) ఎస్.ఎల్. బారువా అన్నారు