NewsOrbit
న్యూస్

Kapatadhaari Review : కపటధారి మూవీ రివ్యూ

Kapatadhaari Review అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ అడపాదడపా సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక రకంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఒక ఫ్లో సినిమాలు చేయడంలో విఫలమయ్యాడు. ‘మళ్ళీరావాసినిమా తర్వాత కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలను చేస్తున్న సుమంత్ తాజాగాకపటధారిఅనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కవలుదారిఅనే కన్నడ ఫిలిం కి ఇది రీమేక్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

Kapatadhaari Review
Kapatadhaari Review

 

Kapatadhaari Review : ప్లస్ లు

సీనియర్ నటుడు నాసర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అతను ఉన్న ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. అంతే కాకుండా అతని చుట్టూ తిరిగే సన్నివేశాలు, పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.

ఈ సినిమా ఇంటర్వెల్ భాగం చాలా బాగా తెరకెక్కించారు. మూల కథలో మెయిన్ పాయింట్ టచ్ చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

రెండవ అర్ధ భాగంలో వచ్చే ట్విస్టులు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకు వెళతాయి. వాటి ఆధారంగానే అక్కడక్కడ స్క్రీన్ప్లే రచించడంతో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి ఏర్పడుతుంది.

ఒక క్రైమ్ థ్రిల్లర్ కి కావలసిన విజువల్స్, మ్యూజిక్ ఈ సినిమాలో ఉన్నాయి. వాటిని మంచి క్వాలిటీ తో తెరకెక్కించారు.

  మైనస్ లు

ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ ఎమోషన్స్ లేకపోవడం. ఎమోషన్స్ పండకపోవడం వేరుఅసలు కథలో ఎమోషన్స్ కు స్కోప్ లేకపోవడం వేరు. ఈ సినిమాలో రెండవది జరిగింది.

సినిమా కథని నేరేట్ చేసే విధానంలో దర్శకుడి అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎక్కడా కూడా సినిమాకి ఫ్లో సాగుతున్నట్లు కనిపించదు. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది.

క్లైమాక్స్ ను చాలామంది ముందే ఊహించి అవకాశం ఉంది. అది కూడా స్క్రీన్ప్లే లోపం వల్లే జరగడం విశేషం. క్లైమాక్స్ ను మరింత రసవత్తరంగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది.

సినిమాలోని పాత్రల క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా దర్శకుడు చాలా తప్పులు చేశాడు. కొంతమందికి పాత్రలకు పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేకపోయాడు. సీన్లు కూడా రిపీట్ అవుతూ వచ్చాయి.

అసలేవరీ కపటాధారి?

సుమంత అక్కినేని (గౌతమ్) ట్రాఫిక్ పోలీస్ గా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే అతనికి క్రైమ్ కేసులు సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఇదే క్రమంలో అతనికి ఒక రోజు ఒకదానితో ఒకటి లింక్ ఉన్నట్లు అనిపించే మూడు మర్డర్ కేసుల గురించి తెలుస్తుంది. ఎవరి సహాయం లేకుండా తానే సొంతంగా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. గౌతమ్ కు నాసర్ (రంజన్) ఈ కేసు గురించి నలభై ఏళ్ల క్రితమే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి అతను ఎన్నో రకాలైన ట్విస్టులను ఎదుర్కొంటాడు. పాత్రలు, వారి స్వభావాలు చిత్రవిచిత్రంగా మారిపోతుంటాయి. చివరికి గౌతమ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ అసలు కథ బయటపడుతుంది. మొత్తానికి ఈ పోలీస్ ఆఫీసర్ అసలు మిస్టరీ ని చేధించాడా లేదా అన్నదే కథ.

విశ్లేషణ 

కపటధారిఈ సినిమా రీమేక్ అయినప్పటికీఒరిజినల్ సినిమాను అందుకోవడంలో విఫలమైంది. చాలా అంశాలలో ఈ చిత్రం ఒరిజినల్ పోలిస్తే వెనుకబడింది. ఆ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, రసవత్తరంగా సాగితే ఈ సినిమా మాత్రం చాలా స్లోగా సాగుతుంది. పైగా కథను చెప్పే విధానంలో కూడా దర్శకుడు తడబడ్డాడు. సినిమాలో జీరో ఎమోషన్స్ ఉండడంతో చాలా మంది ప్రేక్షకులకు డల్ గా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా వచ్చే థ్రిల్ ఎలిమెంట్స్ కథలో ఉండే మంచి మ్యూజిక్, విజువల్స్ ఈ చిత్రాన్ని కాపాడాలి. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చెడగొట్టాలో ఈ సినిమాను చూసి నేర్చుకోవచ్చు.

ఇంతకీ చూడొచ్చా? : దీనికన్నా భాష అర్ధం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని ఒరిజినల్ సినిమా చూడడం మేలు

Related posts

డల్లాస్‌లో ‘ సుస్వర మ్యూజిక్ అకాడమీ ‘ 21వ వార్షికోత్స‌వం.. అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N