NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 19 Today Episode: పాపం మోనిత మాటలకు కరిగిపోయిన కార్తీక్..మరి దీప పరిస్థితి ఏంటో..?

Karthika Deepam Feb 19 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే… మోనిత వాళ్ళ బాబాయ్ కి ఆపరేషన్ చేయవద్దని ఆనందరావు కార్తీక్ ను అడగగా కార్తీక్ ఇంటికి వచ్చి దీప మీద ఫైర్ అవుతాడు. సౌందర్య కూడా ఎప్పుడూలేనంతగా మోనిత ఎందుకు సాయం చేస్తోంది, దాని వెనుక ఎలాంటి కుట్ర ఉందో అని కార్తీక్ కు చెబుతుంది.ఇంతలో అక్కడకు వచ్చిన పిల్లలు డాడీ…అమ్మ మా స్కూల్ టీసీల కోసం తాడికొండ వెళ్లింది రేపు వస్తుంది అనగానే… రేపు కాకపోతే ఎల్లుండు రమ్మను అనేసి కోపంగా వెళ్లిపోతాడు.ఇంకా మోనిత వాళ్ళ బాబాయ్ తో మారిపోయినట్లు నాటకాలు మొదలుపెడుతుంది.నిజంగా మారిందనుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు మోనిత బాబాయ్. అది చూసిన మోనిత..నా ప్లాన్ వింటే ఇప్పుడే నీ గుండె ఆగిపోతుంది అనుకుంటుంది మనసులో.

Bheemla Nayak: భీమ్లా నాయక్ సెగ మామ్మూలుగా లేదు.. అదిరిపడుతున్న ఇతర సినిమా నిర్మాతలు!

Karthika Deepam Feb 19 Today Episode: కార్తీక్ కు నచ్చచెప్పే పనిలో సౌందర్య :

ఇంకా కార్తీక్ ఓ డాక్టర్ గా నేను చేయాల్సిందే అడిగింది మోనిత మరి దీప ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్న కార్తీక్ తో …చిన్నప్పుడు పులి-బంగారు కడియం చదువుకోలేదా అని గుర్తుచేసిన సౌందర్య… కడియం ఆశ చూపించి పులి పిలిచినట్టే ఉందని గుర్తుచేస్తుంది. దీప సరిగ్గానే ఆలోచిస్తుంది కానీ నువ్వే అనే లోగా… అన్నీ నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకు అంటాడు కార్తీక్. ఎందుకంటే పులి ఎప్పటికీ పులే కాబట్టి అని రిప్లై ఇస్తుంది సౌందర్య. మంచితనం మన ఫ్యామిలీకి చాలా చెడుచేసిన విషయం మరిచిపోద్దని అంటుంది.

Intinti Gruhalakshmi: అభి కోపంతో ఎస్సైని ఏం చేశాడు.!? తులసి ఏం చేసి అభిని కాపాడుతుంది.!?
ఆనంద్ కు దగ్గరవుతున్న హిమ, సౌర్యలు :

ఇంకా పిల్లలిద్దరూ…తాడికొండలో పడిన కష్టాలు గురించి మాట్లాడకుంటూ మనం ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లొద్దు. నిజానికి అక్కడకు  వెళ్లాకే తమ్ముడు దొరికాడు, వాడు పెద్దయ్యాక తాడికొండ తీసుకెళ్లి కోటేష్ అంకుల్, శ్రీవల్లి ఆంటీ గురించి చెబుదాం అని శౌర్య అంటుంది. హిమ కోపంగా లేచి నిలబడి ఆనంద్ మన తమ్ముడు..మన అమ్మా నాన్నలే మన తమ్ముడి అమ్మానాన్నలు….వాళ్లు వేరు మనం వేరు అని తమ్ముడికి ఎప్పటికీ తెలియకూడదు అంటుంది.మనం వాడి సొంత అక్కలం అర్థమైందా అంటుంది.వాడు మన తమ్ముడు కాదని ఆనంద్ కి ఎప్పుడూ తెలియనివ్వనని నాకు ప్రామిస్ చేయి అంటుంది హిమ. మొత్తం విన్న సౌందర్య…ఆనంద్ కి పిల్లలు బాగా దగ్గరైపోతున్నారు ఏదోటి చేయాలి అనుకుంటుంది.

మోనిత కుట్రను కార్తీక్ విన్నాడా.?

హాస్పిటల్లో నర్స్ తో మాట్లాడిన మోనిత నేను చెప్పింది చేయి అంటే…నర్సు మాత్రం రివర్సవుతుంది. మీ బాబాయ్ కి ఆపరేషన్ చేయిస్తే చేయించండి లేదంటే లేదు నేను మాత్రం చేయను అనేసి వెళ్లిపోతుంది. మళ్లీ వెనక్కు పిలిచిన మోనిత నీకు ఆఫర్ ఇచ్చాను వద్దన్నావ్ సరే ఇంతటితో ఈ టాపిక్ వదిలేద్దాం, నేను అడిగినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా కార్తీక్ కి అస్సలు చెప్పొద్దు అంటుంది. ఇంతలో పక్కరూమ్ లోంచి బయటకు వచ్చిన కార్తీక్ …మోనిత అని పిలుస్తాడు. తనతో ఏం మాట్లాడుతున్నావ్ అంటే ఏమిలేదు అంటుంది.నీతో మాట్లాడాలి నా క్యాబిన్ కి రా అనేసి వెళ్లిపోతాడు.కొంపతీసి మొత్తం వినేశాడా అనుకుంటుంది మోనిత.

మోనిత మాటలకు కరిగిపోయిన కార్తిక్ :

కార్తీక్ దగ్గరకు వెళ్లిన మోనితతో నేను ఓ మాట అడుగుతాను నిజం చెబుతావా అంటాడు. నిజమే చెబుతాను అడుగు అంటుంది మోనిత.  మోనిత..నేను మీ బాబాయ్ కి ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ తీసేస్తాను, నన్ను ఇబ్బంది పెట్టను అన్నావ్…ఇందులో ఎలాంటి కుట్రలు లేవుకదా అని అంటాడు. వెంటనే కాళ్లపై పడిపోయిన మోనిత ముసలి కన్నీరు కార్చేటప్పటికి వెంటనే కరిగిపోయిన కార్తీక్ సారీ చెబుతాడు…నేను ఊరికే అడిగాను, నువ్వు ఏడవకు పైకి లే అంటాడు. కార్తీక్ నా కన్నీళ్లకు పడిపోయినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టను,నీ జోలికి రాను మా బాబాయ్ ని బతికించు చాలు ఇంకేం వద్దు అని దొంగఏడుపు ఏడుస్తూ బయట అడుగుపెట్టగానే నవ్వుకుంటుంది. కార్తీక్ మాత్రం ఇలా అడిగి బాధపెట్టానా అనుకుంటాడు.

సౌందర్య మోనిత వాళ్ళ బాబాయ్ ఏమి చెప్పిందంటే..?

బస్తీకి వెళ్లిన సౌందర్య..ఇక్కడివారి మనసులు మార్చే ప్రయత్నంలో పడిందా మోనిత అని అడుగుతుంది సౌందర్య. అవును మేడం అవసరానికి డబ్బులు ఇచ్చి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని చెబుతాడు వారణాసి.ఇక మోనిత బాబాయ్ వచ్చి సౌందర్యతో మాట్లాడతాడు ఇచ్చిన మాట ప్రకారం మీకు మా అబ్బాయి ఆపరేషన్ చేస్తాడు అయితే ఆపరేషన్ అయిపోయిన వెంటనే మీరు మోనితని తీసుకుని అమెరికా వెళ్లిపోండి అని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju