NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar23 Today Episode: సౌర్యను కలిసిన హిమ… అంతా మర్చిపోయి సౌర్య ఇంటికి వస్తుందా? లేక హిమను చంపేస్తుందా..?

Karthika Deepam Mar23 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు సౌర్యా అలియాస్ జ్వాల పుట్టినరోజును ఆటో వాళ్ళు అందరు ప్లాన్ చేస్తారు. కానీ జ్వాల మాత్రం నాకు ఇవేమి ఇష్టం లేదు అంటుంది. ఇక చంద్రమ్మ, ఇంద్రుడు దంపతులు జైలర్ దగ్గర పర్సు కొట్టేయడం చూసి జ్వాల వాళ్ళని అడ్డుకుంటుంది.

Karthika Deepam Mar23 Today Episode: తప్పుచేసిన వారిని వదిలేదేలే అంటున్న సౌర్య:

వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాళ్లకు వంటచేసే భార్య-భర్త కావాలంట మీరు అక్కడ జాయిన్ అవ్వండి వాళ్ళకి, జ్వాల(శౌర్య)కి సలహా ఇస్తాడు జైలర్.ఇక ఆటో వెనుక వదిలేదేలే అని రాసి ఉండడం చూసి జైలర్ కూడా ఏంటిది అని అడుగుతాడు జ్వాలను.తప్పుచేస్తే ఎవ్వర్నీ వదిలేదేలే అని అలా రాశా అంటుంది జ్వాల. ఇక జైలర్ చంద్రమ్మ వాళ్ళను చూస్తూ కేడీ దంపతుల్లారా మీ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెబుతాడు. మరోవైపు హిమ పుట్టినరోజు అవ్వడంతో హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచుతుంది.

Karthika Deepam Mar23 Today Episode: సౌర్య ఎక్కడుందో తెలుసుకున్న హిమ :

ఇంతలో వెనుక నుంచి శౌర్య అని పిలుపు వినిపించడంతో ఆనందంగా హాస్పిటల్ అంతా వెతుకుతుంది. ఎవరా శౌర్య అని ఆమె అడ్రస్ చెప్పమని అక్కడున్న వ్యక్తిని అడిగి తీసుకుంటుంది. మరోపక్క జ్వాల ఆటో నడుపుతూ హిమ చేసిన పని తలుచుకుని ఆ హిమని వదిలేదేలే అనుకుంటుంది. బస్తీలో అమ్మా-నేను ఎన్నో కష్టాలు పడ్డాం. మళ్ళీ నాన్నకు దగ్గర అవుతున్న అని ఆనందపడే సమయంలో అది అమ్మా నాన్నలను దూరం చేసింది. మొదట్నుంచీ అది తాతయ్య,నానమ్మ దగ్గర ఆనందంగా పెరిగింది.నేనే అందరికీ దూరమయ్యాను.నన్ను అందరి ప్రేమకి దూరం చేసిన ఆ హిమ మాత్రం అందరితోనూ కలసి ఉంటోంది.ఎన్ని సంవత్సరాలైనా హిమపై కోపం తగ్గదు అనుకుంటుంది. ఇక హిమ మాత్రం సౌర్య ఉన్న అడ్రస్ ను వెతుకుంటూ తనని కలిసేందుకు వెళుతుంటుంది. చిన్నప్పటి నుంచీ శౌర్యతో కలసి ఆడుకున్న రోజులు అన్ని గుర్తుచేసుకుంటుంది.నాపై తనకు కోపం ఇంకా ఉంటుందా అని హిమ అనుకుంటే..మరోపక్క జ్వాల మాత్రం నీపై కోపం తగ్గదు గాక తగ్గదని అనుకుంటుంది.

హిమ, సౌర్యలు ఒకర్ని ఒకరు చూసుకుని గుర్తుపడతారా..?

ఇంతలో హిమ కారు ఆగిపోవడంతో కంగారుగా కిందకు దిగుతుంది సరిగ్గా అదే సమయానికి ఆటో వేసుకుని అక్కడకు వస్తుంది జ్వాల ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటారు. ఇంతలో జ్వాల రోడ్డు ఎమన్నా నీ తాతదా కారు రోడ్డుకి అడ్డంగా ఆపావ్ అని చాలా రాష్ గా అంటుంది. హిమ కారు రిపేర్ వచ్చింది అని అంటుంది. ఇక జ్వాల మాత్రం హిమను చూసి ఈమెను ఎక్కడో చూసినట్టుందే ఎప్పుడైనా నా ఆటో ఎక్కిందా అనుకుంటుంది.సరిగ్గా హిమ కూడా జ్వాలను చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మీరు కారు మెకానికా అంటే..అవును మీ కార్ రిపేర్ అయిందని దేవుడు మెసేజ్ చేస్తే వచ్చేశాను అంటుంది.కారు స్టార్ట్ అవుతుందిలే వెళ్లి స్టార్ట్ చేయి అని చెబుతుంది. జ్వాలకి థ్యాంక్స్ చెప్పి హిమ వెళ్ళిపోతుంది.

హిమ అనుకున్న సౌర్య ఒక చిన్నపిల్లా..?

హాస్పిటల్లో మహిళ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళుతుంది హిమ. అయితే లోపల నుంచి శౌర్య అని పేరు వినిపించడంతో ఇన్నాళ్ల తర్వాత శౌర్యని కలుసుకోబుతున్నా అనుకుంటూ సంతోషంగా లోపలకు వెళ్లి చూడగా ఒక చిన్న పిల్ల కనిపించేసరికి హిమ డల్ అయిపోతుంది.నువ్వు ఎవరని ఆ ఇంట్లో మహిళ అడగడంతో శౌర్య మా అక్క చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయింది, తనని వెతుక్కుంటూ నేను ఇక్కడకు వచ్చానంటుంది.మరోవైపు ఇంద్రుడు-చంద్రమ్మలను తీసుకుని జ్వాల షాపింగ్ చేస్తుంది.

ప్రేమ్ ను కలిసిన సౌర్య:

అప్పుడే ప్రేమ్ కూడా అక్కడికి వస్తాడు.ఆటో అడ్డంగా ఉండటం చూసి ఎవరీ ఆటోవాలా అనుకుంటాడు ప్రేమ్. అదే సమయంలో జ్వాల వచ్చి ఏంటి ఆటోపై చెయ్యేశావ్ అంటూ వాదనకు దిగుతుంది. కారుకి అడ్డంగా పెడితే చెయ్యేంటి కాలేస్తా అంటాడు. కాసేపు ఇద్దరూ గొడవపడతారు. గొడవేంటని ఇంద్రుడు వచ్చి అడిగితే ఆటో అడ్డంగా పెట్టి అడ్డంగా వాదిస్తోందంటాడు ప్రేమ్.మా అమ్మాయి ఇంతేలే గాని నువ్వే కాస్త సర్దుకుపోవాలి అంటుంది చంద్రమ్మ. ఇద్దరు కూడా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అని కాసేపు ఒకర్ని ఒకరు షాకింగ్ చూసుకుంటూ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N