Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. గత గురువారం కోర్టు యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఎన్ఐఎ అభియోగాలను యూసిన్ మాలిక్ అంగీకరించిన నేపథ్యంలో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. తనపై మోపబడిన సెక్షన్ 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యలకు నిధుల సేకరణ) మరియు 20 (ఉగ్రవాద ముఠా సభ్యుడు) తదితర సెక్షన్ల అభియోగాలను సవాల్ చేయడం లేదని మాలిక్ కోర్టుకు తెలిపారు. కాగా దోషిగా తేల్చిన యాసిన్ మాలిక్ కు ఎంత జరిమానా విధించాలో నిర్ధారించేందుకు గానూ ఆయన ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)ను ఆ రోజు కోర్టు ఆదేశించింది.
శిక్ష ఖరారునకు ఈ రోజు వాయిదా వేసిన కోర్టు …జీవిత ఖైదుతో పాటు పది లక్షల జరిమానా విధించింది. పదేళ్ల జైలు శిక్షతో పాటు మరో అయిదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. అంతకు ముందు సెక్షన్ 121 కింద యాసిన్ మాలిక్ కు ఉరిశిక్ష విధించాలని ఎన్ఐఏ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ సెక్షన్ కింద మ్యాగ్జిమమ్ పనిష్ మెంట్ ఉరి శిక్ష కాగా అతి తక్కువ అంటే జీవిత ఖైదు. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి రాజీవ్ కుమార్ శర్మ సెలవులో ఉండటంతో స్పెషల్ జడ్జి ప్రవీణ్ సింగ్ తీర్పును వెలువరించారు.
స్వాతంత్య పోరాటం పేరుతో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద మరియు ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాల నిధులు సమీకరణకు మాలిక్ ప్రపంచ వ్యాప్తంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారని కోర్టు గతంలో పేర్కొంది. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయాద్, హిజ్బుల్ ముజుహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తో పాటు ఫరూఖ్ అహ్మద్ దార్ (బిట్టా కరాటే), షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండి యూసఫ్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయూంఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మహ్రోజుద్దీన్ కల్వాల్, బహీష్ తదితర వేర్పాటు వాదులపై ఎన్ఐఎ చార్జ్ షీటు దాఖలు చేసింది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…