NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వివేకా హత్య కేసుపై కేరళ హక్కుల కార్యకర్త జోమున్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసు విషయంలో కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విషయంపై జోమున్ ఎందుకు స్పందించారు అంటే దానికి ఒక కారణం ఉంది. కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంలో, సీబీఐ సాక్షాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సిస్టర్ అభయ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులు కేసును క్లోజ్ చేసిన తరువాత కూడా జోమున్ ఎంటరై కేసును రీ ఓపెన్ చేయించి సీబీఐ దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కృతకృత్యులైయ్యారు.

 వివేకా హత్య కేసుపై కేరళ హక్కుల కార్యకర్త జోమున్ .సంచలన వ్యాఖ్యలు
kerala jomon sensational comments on ys viveka murder case

నెలల తరబడి సీబీఐ దర్యాప్తు జరుపుతున్నా వివేకా హత్య కేసులో అసలు నిందితులను ఇంత వరకూ శిక్ష పడకపోవడంతో వివేకా కుమార్తె ఇటీవల జోమున్ ను కలిసి దీనిపై చర్చించినట్లు సమాచారం. దీంతో వివేకా హత్య కేసు విషయపై జోమున్ స్పందించారు. వివేకా హత్య విషయంలో పలు అనుమానాలు ఉన్నాయనీ, లోతైన కుట్ర దాగి ఉందని అన్నారు. అనుమానాలపై ఇప్పుడే మాట్లాడటం సరికాదనీ, రెండు నెలల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు జోమున్. ఆ సమావేశంలోనే తన వద్ద ఉన్న సాక్షాధారాలను బయట పెడతానని వెల్లడించారు. ఢిల్లీలోని ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడిన సందర్భంలో ఈ విషయాలను తెలిపారు. మూడు రోజుల క్రితం వివేకా కుమార్తె డాక్టర్ సునీత తనను కలిసి తండ్రి హత్య గురించి చర్చించారని జోమున్ పేర్కొన్నారు. సీబీఐకి సాక్షాధారాల సేకరణలో ఎలా సాయం చేయాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు జోమున్, వివేకా హత్య కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని ఆయన అన్నారు.

కేరళ సిస్టర్ అభయ హత్య కేసును తాను తిరగదోడి దర్యాప్తు చేయిస్తున్న సందర్భంలో నేరానికి పాల్పడిన చర్చి ఫాదర్ తనపై హత్యాయత్నంకు ప్రయత్నించారనీ, అయితే తాను గాయాలతో బయటపడ్డానని తెలిపారు. చివరకు నిందితులకు శిక్ష పడిందని జోమున్ పేర్కొన్నారు. సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంతో కీలక పాత్ర పోషించిన జోమున్ ఇప్పుడు వివేకా హత్య కేసు గురించి మాట్లాడటం, సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపిలో హాట్ టాపిక్ అవుతోంది.

ఇది కూడా చదవండి..రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే… క్లారిటీ ఇచ్చిన డీజీపీి సవాంగ్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N