చాలామంది పొద్దుపొద్దునే లేవగానే వేడికాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. టీ తాగనిదే ఏ పని మొదలు పెట్టలేరు కూడా. అయితే బయట అందుబాటులో ఉన్నాయి కదా అని… గ్రీన్ టీ,కాఫీ లేదా టీ, పొడులకు సంబంధించిన టీ బ్యాగులు కొని ఇంటికి తెస్తున్నారా?ఇంకేముంది మీరు జబ్బుల్ని, అనారోగ్యాన్ని కోరి కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు.
గ్రీన్ టీ, కాఫీ, లేదా టీ వంటివి త్వరగా తయారవుతాయి అని చెప్పి వాటిపొడులకు బదులుగా బ్యాగులను వాడుతున్నవారు చాల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఎందుకంటే ఆ కాఫీ లేదా టీ బ్యాగ్స్ వలన మన శరీరానికి హాని జరుగుతుందని తాజా పరిశోధనల్లో తెలిసింది. ఒక టీ బ్యాగ్ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నట్టుగా సైంటిస్టులు చేసిన ప్రయోగాలలో గుర్తించగలిగారు.
మనం మామూలుగా అయితే టీ బ్యాగ్‌తో తయారైన టీ లో వీటిని కనిపెట్టలేము. కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా పరిశోధకులు వీటిని తాజాగా గుర్తించారు. అందుకే మార్కెట్లో మనకు దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, కేవలం పొడిని మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిశోధనలకు సంబంధించిన తాజా వివరాల్ని అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించడం జరిగింది.
కాఫీ, టీ బ్యాగులను పీవీసీ, నైలాన్, థర్మో ప్లాస్టిక్, ఎపిక్లోరోపైడ్రిన్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ క్రమంలో ఆ బ్యాగులను వేడి వేడి పాలు, లేదా నీటి లో ముంచి నప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి ఆ ద్రవంలో కలిసిపోతాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కార్సినోజెన్ల జాబితాకు చెందుతాయని సైంటిస్టులు తెలిపారు. కార్సినోజెన్లు అంటే ప్రత్యేక్షం గా క్యాన్సర్ కారకాలే. అవి క్యాన్సర్ వ్యాధులను కలగజేస్తాయి. కనుక కాఫీ లేదా టీ ఏది తాగిన బ్యాగులను కాక పొడి రూపం లో వాటిని కొని వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.