NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Ramayapatnam Port: ‘పోర్టు’ పోరు షురూ..! రామాయపట్నం కాదని కృష్ణపట్నం ఎందుకో..?

Ramayapatnam Port: 'పోర్టు' పోరు షురూ..! రామాయపట్నం కాదని కృష్ణపట్నం ఎందుకో..?

Ramayapatnam: Port: రామాయపట్నం పోర్టు Ramayapatnam Port.. ఏపీ, కేంద్రం మధ్య సఖ్యతకు బీటలు వారుతున్నాయా..? పరిస్థితులు ఆ అవకాశం కల్పిస్తున్నాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన పోలవరం అంచనాలు.. ప్రెజెంట్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం.. వీటిపై కేంద్రం నిర్ణయాలతో ఏపీకి పెనం మీద కూర్చున్నట్టుంది. ఇవి చల్లారక ముందే ఇప్పుడు రామాయపట్నం పోర్టు రూపంలో ఏకంగా పొయ్యిలో పడుతున్నట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వ పరిస్థితి. రామాయపట్నాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ కు షాక్ ఇచ్చేలా.. అది మేజర్ పోర్ట్ కాదని.. స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు కోసం రామాయపట్నం పోర్టును బీజేపీ కావాలనే బలి చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

krishnapatnam-port-instead-ramayapatnam-port
krishnapatnam-port-instead-ramayapatnam-port

గతంలో టీడీపీ హయంలో కృష్నపట్నం పోర్టుకు సహాయ సహకారాలు ఉండేవి. నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో పోర్టు అభివృద్ధి చెందింది. ప్రభుత్వం మారి వైసీపీ చేతుల్లోకి వచ్చాక ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేలా జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోర్టు అభివృద్ధికి కృషి చేసింది. కేంద్రం కూడ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమంటూ రామాయపట్నం పోర్టు అభివృద్ధికే సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే.. నవయుగ కంపెనీ కృష్ణపట్నం పోర్టు అభివృద్ధిలో గుజరాత్ కు చెందిన అదానీ కంపెనీ భాగస్వామ్యం అయ్యేలా ఒప్పందం చేసుకుంది. ఇదే ఇప్పుడు బీజేపీ నేతల ఆలోచన మారేలా చేసిందనే వార్తలు వస్తున్నాయి. విభజన చట్టం సాకుగా చూపి మేజర్ పోర్టు కాదనడంలో ఆంతర్యం ఏంటని వార్తలు వస్తున్నాయి.

 

బీజేపీ పెద్దలకు అదానీ గ్రూప్ తో సంబంధాలున్నట్టు ఇప్పటికీ వార్తలు వస్తూంటాయి. ఈ నేపథ్యంలోనే రామాయపట్నం పోర్టును కాదని కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసమే కేంద్రం ఈ ప్రకటన చేసిందని తెలుస్తోంది. టీడీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టును కేంద్రం వ్యతిరేకించింది. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి చెందితే కృష్ణపట్నం పోర్టుకు ఆదాయం తగ్గిపోతుంది. అన్ని అనుకూలతలు రామాయపట్నంకు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో వాటా ఉన్న అదానీకి నష్టం చేకూర్చడం ఇష్టం లేకే కేంద్రం రామాయపట్నం పోర్టును పక్కన పెట్టేస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రం-కేంద్రం మధ్యలో మరో యుద్ధం తప్పేలా లేదు..!

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N