NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మ‌హాసేన రాజేష్ దెబ్బ‌కు టీడీపీలో ఆయ‌న సీటు చిరిగిపోతోందా..!

ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం.. కీల‌క నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోరుగా మార‌నుంది. అదే ఉమ్మ‌డి తూర్పు గోదావ రి జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం. ఈ సీటు నుంచి టీడీపీ త‌ర‌ఫున అనేక మంది పోటీలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానం గా మ‌హాసేన పేరుతో యూట్యూబ‌ర్‌గా కెరీర్ ప్రారంభించి.. త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మాల సామాజిక వ‌ర్గానికి చెందిన రాజేష్ పి.గ‌న్న‌వ‌రం టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే.. ఇదే టికెట్‌ను దివంగ‌త గంటి బాల‌యోగి కుమారుడు గంటి హ‌రీష్ కూడా ఆశిస్తున్నారు.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో హ‌రీష్ అమ‌లాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ద‌ఫా.. అమ‌లాపురం ఎంపీ స్థానం వ‌దిలి.. అసెంబ్లీకి రావాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తొలుత అమ‌లాపురం టికెట్‌నే హ‌రీష్ ఆశించారు. అయితే, అనూహ్యంగా అనేక మంది ఇక్క‌డ తెర‌మీదికి వ‌చ్చారు. దీంతో పీ. గ‌న్న‌వ‌రం నుంచి అయినా.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేది గంటి వార‌సుడి డిమాండ్ గా ఉంది. కానీ.. ప‌రిస్థితి చూస్తే.. ప్ర‌చారంలోనూ.. వైసీపీని టార్గెట్ చేయ‌డంలోనూ.. గంటి హ‌రీష్ వెనుక‌బ‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో మ‌హాసేన రాజేష్ దూకుడుగా ఉన్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ఉమ్మ‌డి గోదావరి జిల్లాల‌కు చెందిన మాల సామాజిక వ‌ర్గాన్ని ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. వారి స‌మ‌స్య‌ల‌పై బ‌ల‌మైన గ‌ళ‌మే వినిపించారు. ఇదే స‌మ‌యంలో వైసీపీపైనా దూకుడుగా ఉంటున్నారు. ఇప్పుడు మ‌హాసేన రాజేష్ ఏపీ, తెలంగాణ‌లో ఏ రేంజ్లో పాపుల‌ర్ అయ్యారో చూస్తూనే ఉన్నాం. వైసీపీని ఓ రేంజ్‌లో ఏకేస్తూ టీడీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా మారారు. దీంతో రాజేష్‌వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం.

అయితే.. పోటీ మాత్రం ఎక్కువ‌గానే ఉంది. మాజీ ఎంపీ బుచ్చి మ‌హేశ్వ‌ర‌రావు కుమార్తె స‌త్య‌శ్రీ స‌హా.. మోకా బాల‌గ‌ణ‌ప‌తి, మోకా ఆనంద సాగ‌ర్ వంటివారు కూడా పి.గ‌న్న‌వ‌రం టికెట్‌ను ఆశిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. బల‌మైన గ‌ళం వినిపించ‌డంలోనూ .. వైసీపీని టార్గెట్ చేయ‌డంలోనూ దూకుడుగా ఉన్న నాయ‌కులకే టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

ఇలా ఎంత‌మంది ఈ టిక్కెట్ కోసం పోటీ ప‌డుతున్నా కూడా గ‌త రెండు న్న‌రేళ్లుగా వైసీపీపై విరుచుకుప‌డుతున్న మ‌హాసేన రాజేష్ వైపే.. పార్టీ మొగ్గు చూప‌నుంద‌ని తెలుస్తోంది. అయితే.. గంటి హ‌రీష్‌కు మాత్రం.. పార్టీ బాధ్య‌త‌లు లేదా.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఎమ్మెల్సీ వంటి హామీ లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju