NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రెడ్ల‌కు జ‌గ‌న్ – వైసీపీపై మోజు తీరిపోయిందా… ఎన్ని రెడ్డి వికెట్లు అంటే..!

నంద్యాల బై పోల్ టైంలో రాయ‌ల‌సీమ రెడ్లు అంద‌రూ ఏక‌మై ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌నోడిని ( జ‌గ‌న్‌ను) గెలిపించుకోవాలి.. ఇది మ‌న ప్రతిష్ట‌కు కీల‌కం అని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌చ్చింది. ఇక 2019 ఎన్నిక‌ల టైంలో మాత్రం సీమ రెడ్లు, కోస్తా రెడ్లు మాత్ర‌మే కాదు… తెలంగాణ‌లో రెడ్లు కూడా ఈ సారి మ‌న రెడ్డి వాడిని ముఖ్య‌మంత్రిని చేసుకోక‌పోతే మ‌న‌కు భ‌విష్య‌త్తు లేద‌ని అన్నీ ప‌ణంగా పెట్టేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి రైతులు, దిగువ మ‌ధ్య త‌ర‌గతి రెడ్లు కూడా త‌మ స్తోమ‌త‌కు మించి వేలు, ఒక‌టి, అరా ల‌క్ష‌ల అప్పు చేసి పార్టీని గెలిపించుకునే క్ర‌మంలో త‌మ వంతుగా సాయం చేశారు.

అయితే ఇప్పుడు వారి ఆశ‌లు అన్నీ క‌రిగిపోయాయి. మ‌నోడు ముఖ్య‌మంత్రి అయితే మ‌న బ‌తుకులు బాగుప‌డ‌తాయి.. మ‌న ప్రాంతానికి మేలు జ‌రుగుతుంద‌ని ఆశించిన వారి ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద రెడ్ల‌లో కూడా జ‌గ‌న్ ప‌ట్ల వారి వైఖ‌రిలో బాగా మార్పు వ‌చ్చేసింది. వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బంప‌ర్ మెజార్టీల‌తో గెలిచిన రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జ‌గ‌న్ పేరు చెపితేనే భ‌య‌ప‌డిపోతున్నారు. కొంద‌రు అయితే ఈ సారి దండం పెట్టేసి పోటీకి దూరంగా ఉంటున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే వైసీపీలో ఉన్న రెడ్డి ప్ర‌జాప్ర‌తినిధులే కాదు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల ప్ర‌జాప్ర‌తినిధులు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టైంలోనే ఆనం, మేక‌పాటి, కోటంరెడ్డి పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేసి జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక భావం చాటుకున్నారు. ఇక మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి త‌న దారి తాను చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఎంపీలు పార్టీని వ‌దిలేసేందుకు రెడీగా ఉన్నారు.

ఆ ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులే కావడం గమనార్హం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి – రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో మాగుంట‌కు జ‌గ‌న్ సీటు ఇవ్వ‌న‌ని ఎప్పుడో చెప్పారు. వేమిరెడ్డికి నెల్లూరు సీటు ఇచ్చినా జ‌గ‌న్ తో వేగ‌లేక బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. విచిత్రంగా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి జ‌గ‌న్ నెల్లూరు రూర‌ల్ సీటు ఇచ్చారు. అయినా కూడా ఆయ‌న టీడీపీ లోకి వెళ్లేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌.

వీరు మాత్ర‌మే కాదు.. జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల‌కు చెందిన రెడ్డి ప్ర‌జాప్ర‌తినిధులు కూడా రేపు టిక్కెట్లు ఎనౌన్స్ అయ్యాక బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే కొంద‌రు టిక్కెట్లు వ‌చ్చిన నేత‌లు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రెడ్డేత‌ర నేత‌ల్లో న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ లిస్టులో మ‌రికొంద‌రు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండ‌నున్నార‌ట‌.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju