ట్రెండింగ్ న్యూస్

మహేష్ అన్ని సినిమాలలో అదే నా ఫేవరెట్ అంటున్న నమ్రత..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి తిరుగులేని క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతూ వరుస బ్లాక్ బస్టర్ లు సాధిస్తూ మంచి జోరు మీద ఉన్న మహేష్ ని ఇండస్ట్రీలో మాస్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చి స్టార్ డాం తెచ్చిన సినిమా “ఒక్కడు” అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Okkadu Full Movie :: Mahesh Babu, Bhumika - YouTubeకాక ఈ సినిమా రిలీజ్ అయ్యే 18 సంవత్సరాలు కావటంతో.. మహేష్ భార్య నమ్రత సంచలన కామెంట్ చేశారు. 2003వ సంవత్సరం జనవరి 15వ తారీఖున రిలీజైన ఒక్కడు సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి సంక్రాంతి టైంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోల సినిమాలు రిలీజ్ అయినా గాని ఒక్కడు సినిమా మాత్రమే భారీ రేంజ్ లో విజయం సాధించింది.

 

MS రాజు గారు నిర్మించిన గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్ల తర్వాత చార్మినార్ సెట్ కీలకపాత్ర పోషించింది. మణిశర్మ అందించిన సంగీతం మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా కర్నూల్ సెంటర్ వద్ద భూమిక పై మహేష్ కత్తి పెట్టే సన్నివేశం అప్పట్లో హైలెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి నమ్రత సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే..”ఒక్కడు సినిమా మహేష్ కెరీర్ లో ఓ క్లాసిక్ హిట్. ఎక్కువసార్లు చూడవచ్చు. అంతేగాక ఈ సినిమా నా ఆల్ టైం ఫేవరేట్ సినిమా” అంటూ నమ్రత కొనియాడింది. ఇదే తరుణంలో మహేష్ అభిమానులు ఒక్కడు సినిమా కి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.


Share

Related posts

Bheemla nayak: ఎందుకయ్యా ఆ డీజే వెర్షన్ చెడగొట్టావ్..థమన్‌కు ఏకేస్తున్న పవన్ ఫ్యాన్స్

GRK

రైతులకు సైంటిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్..!!

sekhar

బిజేపికి వెన్నులో వణుకు పుట్టించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్…!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar