టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా టాలెంట్స్ కలిగింది మంచు లక్ష్మి. యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమారంగంలో కూడా రాణిస్తూ బయట అనేక సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సొంత బ్యానర్లో నటించే నటీనటులతో మంచు లక్ష్మీ చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ విధంగానే రకుల్, తాప్సి, రెజీనా అదే విధంగా కాజల్ ఇలాంటి హీరోయిన్లతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు.
ఫ్రెండ్షిప్ చేయడమే కాక వాళ్లతో పాటు పార్టీలు చేస్తూ వాళ్ల పై రకరకాల కామెంట్లు ఫన్నీగా పెడుతూ పోస్ట్ చేస్తది మంచు లక్ష్మి. తాజాగా ఈ విధంగానే హీరోయిన్ కాజల్ పై సెటైరికల్ కామెంట్ చేసింది. ఇటీవల కాజల్ అగర్వాల్ బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాజల్ అగర్వాల్ పెళ్లిపై స్పందించింది మంచు లక్ష్మి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమె పెళ్లి చేసుకోవటం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయం లాక్డౌన్ సమయంలోనే తెలిసిన, పెళ్లి పార్టీ ఇవ్వటం మర్చిపోకూడదని, ఆ విషయంలో.. నువ్వు చీప్‌గా బిహేవ్ చెయ్యకని, తన ఫ్రెండ్ కాజల్ కి చురకలు అంటించిన ట్లు మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా బయట పరిస్థితులు అంతా అ బాగున్న తర్వాత పెద్ద పార్టీ అరేంజ్ చేయాలని మంచు లక్ష్మి తన ఫ్రెండ్ కి చెప్పినట్లు తెలిపింది.