NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను టార్గెట్ చేసిన సీత‌క్క ఇంత గుర్తింపు ఎలా పొందారంటే…

సీత‌క్క‌… తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అడ‌వి బాట ప‌ట్టిన ఆమె అనంత‌రం ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు ఎంతో చేర‌వ అవుతున్నారు. ఇటీవ‌ల ఆమె ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న తీరు ఎంద‌రికో న‌చ్చింది.

అలా తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయిన ఆమె ఇప్పుడు జాతీయ రాజ‌కీయ నేత‌ల దృష్టిలో ప‌డుతున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్కపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దీంతో, ఆమె రాజ‌కీయ ప్ర‌స్తానం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌రోనా స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో

కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేసి సాయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళ్లి.. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న అక్కడివారికి నిత్యావసరాలు అందించారు. కొన్నిచోట్ల ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్‌ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు. ఆ చాలెంజ్‌ను దాదాపు 60 రోజుల పాటు కొన‌సాగించారు.

ఎంత క‌ష్టానికి ఓర్చారంటే….

కొద్ది దూరం బైక్‌పై‌, మరికొంత దూరం సరైన మార్గంలేని రాళ్లు, రప్పల్లో కాలినడకన ప్రయాణించారు. ఇలా 16 కి.మీ ప్రయాణించి ఆ ఊరికి చేరుకున్నారు. రోడ్డు కూడా సరిగా లేని మార్గంలో నిత్యావసరాలు మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సీతక్క మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది, మీకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.. అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

వ‌ర‌ద స‌మ‌యంలో

వరద ముంపు బాధితులకు సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క త‌న‌దైన శైలిలో చేయూత అందించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లిన ఎమ్మెల్యే.. స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని తీసుకెళ్లారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, ఓడవాడ, ఆచార్య నగర్, నందమూరి నగర్‌ తదితర ప్రాంతాలు ఇటీవల వరద ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు రాబిన్‌ ఉడ్‌ ఆర్మీ బాధ్యులు రమ – దామోదర్‌ ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల్లో బాధితులకు చీరలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీతక్క.. ఎలిశెట్టిపల్లికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గం లేకపోవడంతో పడవపై జంపన్న వాగు దాటారు. అక్కడ దిగాక కొద్దిదూరం నడవాల్సి ఉండటంతో ఇతరులతో కలసి సీతక్క స్వయంగా దుప్పట్లను మోశారు. అనంతరం బాధితులకు సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో కేసీఆర్‌పై

ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై సీత‌క్క ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ములుగు ఎమ్మెల్యే విమ‌ర్శించారు. 72వేల కోట్లతో పార్కులు, బాత్ రూమ్ లు మాత్రమే కట్టారన్నారు. ఈ డబ్బుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏమైనా నిర్మించారా అని ప్ర‌శ్నించారు. మంచి నీళ్లు ఇవ్వడం లేదు కానీ… మద్యం మాత్రం డెలివరీ చేస్తున్నారన్న సీత‌క్క‌..ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరితే..కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు లేవని ఎగతాళి చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసింది మీ పదవులు కోసమేనా అని ములుగు ఎమ్మెల్య సీత‌క్క ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

సీత‌క్క దేశంలోనే ఇలాంటి ఎమ్మెల్యే ఆమె ఒక్క‌రే

కాంగ్రెస్ ముఖ్య నేత‌ రాహుల్ గాంధీ పార్టీ సోషల్ మీడియా టీంతో జరిగిన జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే సీతక్క చాలా కష్టపడుతున్నారని, ప్రతి పార్టీ ప్రోగ్రాం పాటిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటూ రాహుల్ గాంధీ కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో సీతక్క లాంటి ఎమ్మెల్యే ఉండడం గర్వకారణమని రాహుల్ గాంధీ ప్ర‌శంసించారు.

author avatar
sridhar

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N