టాలీవుడ్ ఇండస్ట్రీలో సుడిగాడు సినిమాలో మోనాల్ హీరోయిన్ గా పరిచయం అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన గాని మోనాల్ పెద్దగా ఆ తర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో భారీ స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది మోనాల్. అఖిల్ , అభిజిత్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ చేసి షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో వ్యవహరించింది.
ఇక హౌస్ లో గేమ్ చివరాకరికి వచ్చే టైంకి చాలా బాగా ఆడుతూ హారిక నీ కెప్టెన్ చేయటంలో బాగా కష్టపడి తన మీద మంచి ఒపీనియన్ జనాలకు ఉండేలా చూసుకుంది. కానీ సరిగ్గా టాప్ ఫైవ్ కి వెళ్లక ముందు హౌస్ నుండి మోనాల్ ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక మంచి పాపులారిటీ ఏర్పడటంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఈ గుజరాతి భామకి.
అంత మాత్రమే కాక స్టార్ మా లో ప్రసారమయ్యే ఓ డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే ‘కాగజ్’ అనే బాలీవుడ్ చిత్రంలో మోనాల్ నటించడంతో ఆ సినిమాకి సంబంధించి ‘బైల్గాడి’ అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సాంగులో పేదింటి రైతుకు భార్యగా నటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిలీజైన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.