Allari Naresh: అల్లరి నరేష్ హీరోగా కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు విడుదల చేసేవారు. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా చలామణి అయ్యేవాడు. దీంతో చాలామంది నిర్మాతలు కామెడీ నేపథ్యం కలిగిన సినిమాలు నరేష్ తో చేయడానికి ఎగబడే వాళ్ళు. కానీ కొంతకాలానికి ఇండస్ట్రీకి అల్లరి నరేష్ దూరం కావడం జరిగింది. దాదాపు 5, 6 సంవత్సరాలు పాటు ఎలాంటి సినిమాలు చేయలేదు.
అలాంటి పరిస్థితులలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమాలో స్నేహితుడి పాత్రలో నరేష్ అద్భుతమైన నటన కనబరిచి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “మహర్షి” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇటీవలే నాగార్జున హీరోగా వచ్చిన “నా సామి రంగ” సినిమాలో కూడా నరేష్ హీరో ఫ్రెండ్ పాత్రలో నటించడం జరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో అల్లరి నరేష్ సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలయింది. కానీ లేటెస్ట్ గా “ఆ ఒక్కటి అడక్కు” అనే సినిమా చేయడం జరిగింది.
మల్లి అంకం దర్శకత్వంలో నరేశ్ హీరోగా కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టీజర్ మంగళవారం రిలీజ్ అయింది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫన్నీ డైలాగులతో ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్…అల్లరి నరేష్ మధ్య అద్భుతమైన కామెడీ ట్రాక్ నడిచింది. వయస్సు మీద పడుతున్న కానీ పెళ్ళికాని యువకుడిగా నరేష్ పాత్ర సినిమాలో ఉన్నట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకు రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.