NewsOrbit
న్యూస్ సినిమా

F 3 – Major: ఒకే రోజు రెండు సినిమాలు దేనికదే..పోటీ ఉండదంటున్న మేకర్స్..

F 3 – Major: కరోనాకు ముందు వరకు బాక్సాఫీస్ వద్ద రెండు కాదు ఏకంగా ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు రిలీజైన సందర్భాలు కోకొల్లలు. కానీ, కరోనా ప్యాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీలలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇప్పటికే వేల కోట్ల నష్టాలలోకి వెళ్ళిపోయిన చిత్రపరిశ్రమ దానిని భర్తీ చేసేందుకు శత విధాలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తమ సినిమాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి తమ సినిమాకి ముందు రెండు వారాలు ఆ తర్వాత రెండు వారాలు మరో సినిమా రిలీజ్ కాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలన్నీ అలాగే సోలో డేట్‌తో వస్తున్నాయి.

f-3-major-is releasing on same day
f-3-major-is releasing on same day

కానీ, రెండు సినిమాలు మాత్రం ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఆ చిత్రాలే ఎఫ్ 3, మేజర్. ఇప్పటికే ఎఫ్ 3 సినిమాను మే 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. ఇక ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2 ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఖచ్చితంగా ఎఫ్ 3 సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను మిగతా సినిమాలతో పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయాలనుకున్నారు.

F 3 – Major: చివరి దశలో ఏదైనా ఒకటి

తప్పుకుంటుందా..?

అయితే, మేజర్ సినిమాను మాత్రం అదే తేదీకి విడుదల చేయాలని ఆ చిత్రబృందం భావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వసూళ్ల పరంగా రెండు సినిమాలకు గ్యారెంటీగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం అంటే ఖచ్చితంగా ఎఫ్ 3 మేజర్ సినిమాలకు బాగానే నష్టం వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అడవి శేష్ – సాయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఇందులో శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శశి కిరణ్ తిక్కా దీనికి దర్శకుడు. మరి ఇలా రెండు సినిమాలు ఒకేరోజు వస్తాయా..చివరి దశలో ఏదైనా ఒకటి తప్పుకుంటుందా అనేది కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri