Intinti Gruhalakshmi: తులసికి వాళ్ళ మేనేజర్ కాల్ చేసి.. సారీ మేడమ్.. బ్యాడ్ న్యూస్.. బ్యాంక్ మేనేజర్ వాళ్ళు లోన్ ఇవ్వను అన్నారని చెబుతారు.. ఏమైందమ్మ తులసి అని వాళ్ళ మావయ్య అడగగా.. శశికళ అప్పు కోసం బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నాను కదా.. ఆ లోన్ రాదని మేనేజర్ చెప్పాడు.. ఇప్పుడు శశికళ అప్పు విషయం ఏం చేయాలో పాలుపోవడం లేదు అని అంటుంది.. అంతలో శశికళ అమ్మి అంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది.. శశికళ రాకతో తులసి షాక్ అవుతుంది..!
ఏంటి అమ్మి నేను రాగానే ఆ షాక్ అయ్యవు అని అంటుంది.. ఇంకా రెండు రోజులు గడువు ఉందిగా ముందే వచ్చారుగా అందుకే.. ఈ మధ్యన నీ గురించి చాలా విన్నాను.. అందుకే ముందే రావాల్సి వచ్చింది.. నీ మాజీ భర్త నిన్ను కాదని ఇంట్లో నుంచి వెళ్లి పోయడంటా.. నీ చిన్న కొడుకుని నువ్వే ఇంట్లో నుంచి బయటికి పంపించేశావంట.. నా బాకిని నలుగురికి నాలుగు వాటాలు వేశవు.. అందులో ఇద్దరు లేరు.. అందుకే ముందుగానే జాగ్రత్త పడాలని ఇటు వచ్చా అమ్మి అంటూ.. నీకొక ఆఫర్ ఇస్తా.. నీ బాకీ ఎత్తేసి నీ చేతికి ఒక 20 లక్షలు డబ్బులు ఇస్తా.. కాకపోతే ఈ ఇల్లు నాది అవుతుంది అని అంటుంది.. ఇక ఎవరో చెప్పినట్టే భాగ్య సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇంట్లో నాకు వాటా ఉందనీ.. శశికళ ఇంటి కాగితాలు తులసి పేరు మీద ఉన్నాయి అని అంటుంది.. నేను కోర్టు లో మా అత్తమామలను మోసం చేసి రాయించుకుంది అని కేసే వస్తె తీర్పు వచ్చేవరకు నువ్వు నోట్లో వేసుకుని కూర్చోవాలి అని అంటుంది.. తులసి నీకు రెండు రోజులు టైమ్ ఇస్తున్నా ఆ లోపు నువ్వు అన్ని సెట్ చేసుకో ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీసర్ తో వచ్చి నీ చేత ఇల్లు రాయించుకుంటా అని అంటుంది శశికళ.. భాగ్య కూడా తులసికి ఒక రోజు టైమ్ ఇచ్చి నా సంగతి తేల్చండి అని అంటుంది..
ప్రేమ్ రాగానే టీ ఇస్తుంది.. అంతా బాగున్నప్పుడు అందరూ హుషారుగా ఉంటారు. గొంతులో గరలం ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటే ఆ బాధ కూడా మనల్ని చూసి పారిపోతుంది అనగానే.. ప్రేమ్ కంట తడి పెట్టుకుంటాడు. శృతి ఏదో ఒక జాబ్ చేస్తానని అని అంటుంది. నువ్వు నీ కాన్సంట్రేషన్ అంతా నీ లక్ష్యం పై పెట్టు అని అంటుంది శృతి..
భాగ్య మాటలు విన్న తర్వాత నేను మీ మాజీ కోడలు.. ఒక విధంగా భాగ్య కే హక్కు ఉంది. భాగ్య సంసార భారాన్ని మోస్తూంది అని తులసి మాటలు విన్న వాళ్లమావయ్య.. నువ్వే ఊబిలో కూరుకుపోతున్నావమ్మ మరొకరికి చెయ్యి అందించాలని ప్రయత్నించడమే.. నువ్వు ఇంకా ఊబిలో కూరుకుపోతావు అని వాళ్ళ మావయ్య తులసితో అంటాడు. భాగ్య కు నేనే నచ్చచెప్తాను. భాగ్య ను ఒప్పిస్తాను అని తులసి అంటుంది. నా వాటా నాకు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని లాస్య తో చర్చిస్తుంది భాగ్య.. ఇక ఈ కథ ఎటు మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.