Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించడం జరిగింది. కానీ అన్యోన్యంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. విషయంలోకి వెళ్తే మొదటి భాగం సలార్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పాటు అనుకున్న టయానికి ఇవ్వలేమని.. గ్రాఫిక్ టీం చెప్పడంతో.. సినిమా వాయిదా వేస్తున్నట్లు.. కొత్తది ప్రకటిస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 22వ తారీకు సినిమా విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని.. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఈ తేదీ “సలార్” కి సుట్ అవుతుందని భావిస్తున్నారట. సరిగ్గా “సలార్” విడుదల తేదీకి ముందు రోజు షారుక్ “డుంకి” విడుదల కానుంది. రాజ్ కుమార్ ఇరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రభాస్ వర్సెస్ షారుక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నట్లు సమాచారం.
“బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో సలార్ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్” సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగం యొక్క బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. “KGF 2” సినిమాతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం జరిగింది. దీంతో కచ్చితంగా ప్రభాస్ కి సలార్ సినిమా ద్వారా.. హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.