NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

‘The Village’ Review: ‘ది విలేజ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన హీరో ‘ఆర్య’.. సిరీస్‌తో హిట్టు కొట్టాడా?

the village web series review

‘The Village’ Review: ఈ మధ్యకాలంలో హారర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు సంబంధించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇలాంటి కేటగిరీకి చెందిన కంటెంట్‌ను అందించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇలాంటి కేటగిరీలోనే అమెజాన్ ప్రైమ్ వేదికపై ‘ది విలేజ్’ సిరీస్ వచ్చింది. హీరో ఆర్య కథానాయకుడిగా నటించి మొదటి వెబ్ సిరీస్ ఇది. సీజన్-1లో భాగంగా 6 ఎపిసోడ్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అవళ్’ సినిమాతో మెప్పించిన మిలింద్ రావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉంది? సిరీస్ స్టోరీ ఏంటి? కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సిరీస్‌తో హీరో ఆర్య హిట్ అందుకున్నాడా? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

వెబ్ సిరీస్ పేరు: ది విలేజ్

నటీనటులు: ఆర్య, దివ్య పిళ్లై, బేబీ ఆగ్జియా, ఆడుక్కాలమ్ నరేన్, జార్జ్ మరియన్, ఓన్ కొక్కెన్, థలైవసల్ విజయ్.
డైరెక్టర్: మిలింద్ రావు
ప్రొడ్యూసర్: బీఎస్ రాధాకృష్ణన్
రిలీజ్ డేట్: 2023 నవంబర్ 24

the village web series review
the village web series review

సినిమా స్టోరీ:

అది తూత్తుకుడి జిల్లాలోని ‘కట్టియల్’ గ్రామం. ఈ గ్రామంలో దెయ్యాలు, భూతాలు సంచరిస్తూ ఉంటాయని, ఆ గ్రామం వైపు వెళ్లిన వారు తిరిగి వచ్చిన దాఖలు లేవని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. వెబ్ సిరీస్ ప్రారంభంలో బస్సులో ఓ కుటుంబం వెళ్తూ ఉంటుంది. అందులో ఓ గర్భిణీ ఉంటుంది. అలా వెళ్తున్న వాహనం ‘కట్టియర్’ ఊరు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వారిపై కొందరు మ్యూటెంట్స్ దాడి చేస్తారు. అంతలో ఆ సీన్ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్‌గా పని చేస్తున్న గౌతమ్ (ఆర్య), అతని భార్య నేహ (దివ్య పిళ్లై) కూతురు మాయ (బేబి ఆర్జియా)ను చూసిస్తారు. ట్రిప్పు కోసం వెళ్తున్న వాళ్లకు హైవేపై యాక్సిడెంట్ వల్ల వేరే మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ కారు ‘కట్టియల్’ దిశగా వెళ్తుంది. కట్టియల్ గ్రామానికి చేరుకోగానే కారు టైర్లు పంక్చర్ అవుతాయి. అప్పటికే బాగా చీకటిగా ఉంటుంది. దాంతో భార్యాబిడ్డను కారులో కూర్చోమని చెప్పి సాయం కోసం గౌతమ్ కొంత దూరం నడుచుకుంటూ వెళ్తాడు. ‘నవమలై’ అనే గ్రామంలోని ఓ హోటల్లో పీటర్ (జార్జ్ మరియన్), శక్తి (ఆడుక్కాలమ్ నరేన్)ను సాయం కోసం అడుగుతాడు. తన భార్య పిల్లలు ‘కట్టియల్’ గ్రామం దగ్గర ఉన్నారని, తన కారు పంక్చర్ అయిందని చెప్తాడు. ఆ గ్రామం పేరు చెప్పగానే ఆ హోటళ్లో ఉన్న అందరూ భయపడతారు. ఆ గ్రామం చాలా డేంజర్ అని, ఉదయాన్నే వెళ్దామని చెప్తారు. ఆ మాటలు విన్న గౌతమ్.. అక్కడ ఉండకుండా భార్యాబిడ్డ కోసం మళ్లీ వచ్చిన దారే వెనక్కి వెళ్తాడు.

అప్పుడే వర్షం మొదలవుతుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న గౌతమ్ కాలికి కట్టే తగిలి కిందపడిపోతాడు. దాంతో అక్కడికి పీటర్, శక్తి వచ్చి గౌతమ్‌ను లేపి కారు ఉన్న చోటుకు వెళ్తారు. అక్కడికి వెళ్లాకా కారు, భార్యబిడ్డ కనిపించదు. ఇదిలా ఉండగా.. సింగపూర్‌లోని శ్రీమంతుడు జీఎస్ఆర్ (జయప్రకాష్), ఆయన కొడుకు ప్రకాశ్ (అర్జున్ చిదంబరం)ను చూపిస్తారు. పుట్టుకతో ప్రకాశ్ అవిటివాడు. తన కొడుకును బాగు చేయడానికి ‘కట్టియల్’ ప్రాంతంలో అనేక ప్రయోగాలు చేస్తాడు. ఆ ప్రయోగం వికటించడం వల్ల అక్కడ ప్రమాదకరమై పరిస్థితులు ఏర్పడతాయి. ఎలాంటి పరిస్థితిలోనూ అక్కడికి వెళ్లొద్దని ప్రకాశ్‌కు జీఎస్ఆర్ చెప్తాడు. అయితే తండ్రి పరిశోధనకు సంబంధించిన శాంపిల్స్ అక్కడ ఉన్నాయని తెలుసుకున్న ప్రకాశ్.. ఆ ఔషధం కోసం టీమ్‌ను పంపిస్తాడు. దాంతో సీరిస్ మెయిన్ కాన్సెప్ట్ మొదలవుతుంది. కట్టియల్ గ్రామానికి వెళ్లిన టీమ్ ఆ ఔషధాన్ని దక్కించుకుంటారా? భార్యాబిడ్డను కోల్పోయిన గౌతమ్.. మళ్లీ వాళ్లను కాపాడుకుంటాడా? అసలు ‘కట్టియల్’ గ్రామ చరిత్ర ఏమిటి? కట్టియల్ గ్రామంలో జీఎస్ఆర్ చేసిన ప్రయోగం ఏంటి? మనుషులను పీక్కుతినే మూటెంట్స్ ఎలా పుట్టారు? తదితర విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

the village web series review
the village web series review

సిరీస్ ఎలా ఉంది?

సినిమా స్టోరీ విషయంలో డైరెక్టర్ మిలింద్ రావును మెచ్చుకోవాలి. సిరీస్ ప్రారంభంలో సస్పెన్స్‌తో మొదలవుతుంది. కట్టియల్ గ్రామం చుట్టే సినిమా సాగుతుంది. ట్విస్టులతో సీరిస్‌కు హైప్ క్రియేట్ అయింది. మొదటి మూడు పార్టులు ఆసక్తికరంగా సాగుతాయి. 4, 5వ భాగాలు సాగదీతగా అనిపించాయి. చివరి పార్టులో ఫైటింగ్ సీన్లు, మ్యూటెంట్ల అరాచకాలను చూడవచ్చు. కొన్ని సీన్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని సీన్లు ఇదివరకే చూసినట్లు అనిపిస్తాయి. సిరీస్ చివరల్లో సస్పెన్స్‌తో ముగుస్తుంది. సినిమాటోగ్రఫి, విజువల్స్, ఫైటింగ్స్ బాగుంటాయి. హీరో ఆర్య యాక్టింగ్ పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. సైడ్ క్యారెక్టర్స్‌కే సిరీస్‌లో ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

న్యూస్‌ ఆర్బిట్ రేటింగ్: 2.75/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N