టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కడు సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని పోకిరి సినిమాతో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ బాబు తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలామంది మహేష్ కి హీరోల లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ కూడా మహేష్ ని ఎంతగానో అభిమానిస్తూ ఉంటది. ఇదిలా ఉంటే ఏకంగా అక్కినేని నాగ చైతన్య తన అప్ కమింగ్ “థాంక్స్” మూవీలో మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా క్యారెక్టర్ చేయబోతున్నాడు. “మనం” సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్ క్యారెక్టర్ నాగచైతన్య చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ నగరం అబిడ్స్ లో రామకృష్ణ సినిమా హాల్ వద్ద జరుగుతుందట. ఈ నేపథ్యంలో మహేష్ వీరాభిమానిగా నాగచైతన్య బ్యానర్లు మహేష్ బ్యానర్లు కట్టిన సన్నివేశాలు దర్శనమిస్తున్నాయట. ఇదిలా ఉండగా మనం లాంటి క్లాస్ సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ “థాంక్స్” సినిమాని పూర్తి మాస్ తరహాలో తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.