కొత్త సంవత్సరం జననాలలో భారత్ టాప్

కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతున్న వేళ…కొత్త వెలుగు రేకలు ఉదయించాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది నవజాత శిశువులు కొత్త సంవత్సరం రోజున జన్మించారు.

అలాంటి జననాలు భారత్ లోనే ఎక్కువ. నూతన సంవత్సరం రోజున అంటే 2019 జనవరి ఒకటో తేదీన భారత్ లో శంలో 69,944 మంది పిల్లలు జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం తొలి రోజున జన్మించిన వారిలో భారత్ లో ఆ జననాల శాతం 18%. కొత్త సంవత్సరం రోజున భారత్ లోనే అత్యధికంగా  జననాలు సంభవించాయి.