‘సీఎం ’గా చంద్రబాబు కు లాస్ట్ ‘జనవరి 1 ’

హైదరాబాద్, జనవరి 1 : సిఎంగా చంద్రబాబునాయుడుకు ఇదే చివరి జనవరి 1 అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్లో కామెంట్ చేశారు. విభజన తర్వాత తొలిసారిగా 2014లో టీడీపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలు తిరిగి తీసుకోనున్నారని చెప్పారు.
అధికారం కోల్పొయిన తర్వాత తన మనవడు ‘దేవాన్ష్‌తో చంద్రబాబు హాయిగా ఆడుకోవచ్చని తెలిపారు. ప్రజలకు బాబు అంతకన్నా ఏమి ఇవ్వగలరని విమర్శించారు. తెలంగాణా ఎన్నికలకు ముందు టీడీపీ టిఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించిందనీ, మాదక ద్రవ్యాలను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.