కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌


తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కేటీఆర్ శ‌నివారంనాడు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌ద‌రు మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ స్పందించారు. స‌మీక్షా స‌మావేశంలో అధికారుల‌తో పాటు న‌గ‌ర పౌర సంఘం కూడా పాల్గొన్నారు. వీరి నుండి మంత్రికి 300 స‌ల‌హాలు, సూచ‌న‌లు వ‌చ్చాయి. అలాగే నిర్మాణ రంగాలు చేసిన సూచ‌న‌లు గురించి ఈ సమావేశంలో చ‌ర్చించారని స‌ద‌రు మంత్రిత్వ శాఖ‌వారు సోష‌ల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోల‌ను చూసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ స్పందించారు. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు స్లిప్ రోడ్లు చాలా అవ‌స‌ర‌మ‌ని ట్వీట్ చేశారు. ఈ ప్ర‌తిపాద‌న చాలా బావుంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు తెలిపారు.