పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకుని సినిమాల్లో నటించాలని అనుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్గా డైరెక్టర్ క్రిష్ కథను ఓకే చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినపడ్డాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడానికి హరీశ్ శంకర్‌ను ట్రాక్‌లోకి తెచ్చారట. ప్రస్తుతం పవన్‌తో చర్చలు జరుపుతున్నారట. అంతా ఓకే అయితే పవన్, హరీశ్ శంకర్ సినిమా ట్రాక్ ఎక్కేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన `గబ్బర్‌సింగ్` బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా ఓకే అయితే సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
previous post
next post
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు