NewsOrbit
Uncategorized రివ్యూలు

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

కొన్ని కాంబినేష‌న్స్‌లో రూపొందే సినిమాలు ప్రారంభం నుండి ఆస‌క్తిని రేపుతాయి. అలా ఆస‌క్తిని రేపిన సినిమాల్లో ఒక‌టి `వెంకీమామ‌`. టైటిల్‌లో ప్ర‌స్తావించిన‌ట్లే స్టార్ హీరో వెంకటేశ్ మామ పాత్ర‌లో న‌టించగా, అక్కినేని నాగ‌చైత‌న్య మేన‌ల్లుడు పాత్ర‌లో న‌టించారు. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో, అక్కినేని ఫ్యామిలీ హీరో కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. అదీ కాకుండా నిజ జీవితంలో మామ అల్లుళ్లైన వెంక‌టేశ్‌, చైత‌న్య ఈ సినిమాలో కూడా అదే పాత్ర‌ల్లో న‌టించారు. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మామ‌, అల్లుడు మ‌ధ్య అనుబంధాన్ని ద‌ర్శ‌కుడు బాబీ ఎలా ఎలివేట్ చేశాడు?  అస‌లు సినిమా ప్రేక్ష‌కుల‌కు మే ఆక‌ట్టుకుందా?  లేదా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే  సినిమా క‌థేంటో చూద్దాం…

బ్యాన‌ర్స్‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
న‌టీన‌టులు: వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, నాజ‌ర్, రావు ర‌మేష్‌, దాసరి అరుణ్‌, శివ‌న్నారాయ‌ణ‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, అదుర్స్ ర‌ఘు, ప్ర‌కాశ్‌రాజ్‌, ఆదిత్య మీన‌న్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌ త‌దిత‌రులు
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌
నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)

క‌థ‌:
గోదావ‌రి ప్రాంతంలో జాత‌క బ్ర‌హ్మ‌గా పేరు పొందిన వ్య‌క్తి(నాజ‌ర్‌) కొడుకే వెంక‌ట‌ర‌త్నం(విక్ట‌రీ వెంక‌టేశ్‌). ఆయ‌న‌కు ఆర్మీకి వెళ్లాల‌నే కోరిక ఉంటుంది. ఆర్మీ జాబ్‌కి కూడా ఎంపిక‌వుతాడు. తండ్రి జాత‌కాలు బాగోలేద‌ని చెప్పినా వినిపించుకోకుండా అక్కకి న‌చ్చిన‌వాడికిచ్చి పెళ్లి జ‌రిపిస్తాడు. వారికి పట్టిన బిడ్డ‌కు ఏడాది పూర్త‌య్యే స‌రికి భార్యాభ‌ర్త‌లు చ‌నిపోతార‌ని జాత‌కంలో చెప్పిన‌ట్టే జ‌రుగుతుంది. అనాథ అయిన మేన‌ల్లుడిని తండ్రి వ‌ద్ద‌ని వారిస్తున్నా ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తాడు వెంక‌ట‌ర‌త్నం. అల్లుడు కోసం ఉద్యోగాన్ని వ‌దులుకుని త‌న‌ని పెంచి పెద్ద చేస్తాడు. పెళ్లి కూడా చేసుకోఉడు. మేన‌ల్లుడు కార్తీక్ శివ‌రాం(నాగ‌చైత‌న్య‌)కి కూడా మావ‌య్య అంటే ప్రాణం. ఆయ‌న కోసం లండ‌న్‌లో వ‌చ్చిన ఉద్యోగాన్ని, ప్రేమ‌ను వ‌దులుకుంటాడు. వెంక‌ట‌ర‌త్నం తండ్రి వారిద్ద‌రినీ దూరం చేయాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌రదు. ఆదే స‌మ‌యంలో త‌న కోసం మావ‌య్య పెళ్లి చేసుకోలేద‌ని తెలిసి, ఆయ‌న కోసం సంబంధాలు చూడ‌టం మొద‌లు పెడ‌తాడు. ఊరికి వచ్చిన హిందీ టీచ‌ర్ వెన్నెల‌(పాయ‌ల్ రాజ్‌పుత్‌)ను మావ‌య్య‌కిచ్చి పెళ్లి చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో త‌న‌కోసం అల్లుడు ప్రేమ‌ను కాదనుకున్నాడ‌ని తెలుసుకుని అల్లుడు ప్రేమించిన అమ్మాయి హారిక (రాశీఖ‌న్నా)ను క‌లిసి ఇద్ద‌రినీ ఒక‌టి చేస్తాడు. అప్పుడు వెంక‌ట‌ర‌త్నం తండ్రి కార్తీక్ జాత‌కం వ‌ల్ల వ‌చ్చే న‌ష్ట‌మేంటో చెబుతాడు. అస‌లు కార్తీక్  జాత‌కంలోని స‌మ‌స్య ఏంటి?  కార్తీక్ త‌న మావ‌య్య‌కి చెప్ప‌కుండా ఆర్మీకి ఎందుకు వెళ్లిపోతాడు?  చివ‌ర‌కు జాత‌కం నిజ‌మ‌వుతుందా?  మామ అల్లుళ్లు క‌లుసుకుంటారా?  లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:
స‌మీక్ష‌:
రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు… రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లుగా నటిస్తున్నారని అనగానే, అందులోనూ వెంకీమామ అనే టైటిల్‌ చూడగానే సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. మామా, అల్లుడు స్క్రీన్‌ మీద కనిపించినంత సేపు కూడా అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ సంబరంగా కనిపించారు. మామా, అల్లుడు కాన్సెప్ట్ ను బాబీ బాగానే రాసుకున్నారు. వెంకటేష్‌ – పాయల్‌ జోడీని, నాగచైతన్య-రాశీఖన్నా జోడీని కాకుండా, వెంకటేష్‌-రాశీ, చైతూ – పాయల్‌ మధ్య పెట్టిన సన్నివేశాలు ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. సినిమాలో ఎంపిక చేసుకున్న అన్ని పాత్రలకూ బాబీ న్యాయం చేశాడనే అనిపించింది. అయితే కేరక్టర్లు, కేరక్టరైజేషన్లమీద పెట్టిన దృష్టిని ఆయన ఇంకాస్త సన్నివేశాల అల్లిక మీద పెట్టాల్సిందని అనిపించింది. ఎమోషన్‌ బలంగా పండాల్సిన పలు సందర్భాల్లో అనుకున్నంత స్థాయిలో ఎమోషన్స్ ని ఎలివేట్‌ చేయలేదేమోనని అనిపించింది. సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగిన క్లైమాక్స్ లో రెండు దేశాల మధ్య అంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు తీసిన సన్నివేశాలు ఇంకా పటిష్టంగా ఉండాల్సింది. రీరికార్డింగ్‌తో కూడా ఎమోషన్‌ని ఇంకా పండించాల్సింది. ఫైనల్‌ క్లైమాక్స్ సన్నివేశాలు ప్లే అవుతున్నప్పుడు ప్రేక్షకుడు అంతకుమించి అనే విధంగా ఇంకేదో విషయాన్ని ఆశించాడు. అయితే అవేమీ సినిమాలో కనిపించకపోవడంతో, క్లైమాక్స్ తేలిపోయినట్టు అయింది. నిర్మాత పెట్టిన ఖర్చు, లొకేషన్లలో  ఉన్న రిచ్‌నెస్‌… ఆ సన్నివేశాలను రాసుకోవడంలో కనిపించదు. సన్నివేశాల పరంగా డెప్త్ లేకపోవడంతో మొత్తం వృథా అయిపోయిందనే భావన ప్రేక్షకుడికి తప్పక కలిగే తీరుతుంది. అవన్నీ ఆలోచించకుండా… జస్ట్ మామా అల్లుళ్లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకునేవారికి మాత్రం సినిమా బాగానే నచ్చుతుంది

చివ‌ర‌గా.. `వెంకీమామ‌`… కొంద‌రికీ ప‌రిమితం
రేటింగ్‌: 2.5/5

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment